యాప్నగరం

బ్యాంకర్ల తీరు మారకుంటే కఠిన చర్యలు - ఏపీ సీఎం

అమరావతి: నోట్ల రద్దు అనంతరం పరిణామాలు, బ్యాంకర్ల పనితీరుపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

TNN 28 Nov 2016, 3:20 pm
అమరావతి: నోట్ల రద్దు అనంతరం పరిణామాలు, బ్యాంకర్లు పనితీరుపై ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో బ్యాంకర్లు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చిల్లర కొరత నివారించేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. బ్యాంకర్ల సహాయ నిరాకరణ, నిర్వహణ లోపాల వల్ల ప్రజల దృష్టిలో తాము నిస్సహాయులుగా నిలిచిపోయామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు వారాలైనా ఇప్పటి వరకు చిల్లర కొరతను తీర్చక పోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకర్ల వైఖరి ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించినట్లు తెలిసింది. అలాగే సంక్షేమ పథకాల అమలు విషయంలో నోట్లు రద్దు ప్రభావంపై సమీక్షించారు. పెన్షన్లు, స్కాలర్ షిప్పుల విడుదల సమయంలో చిల్లర కొరత లేకుండా చూడాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు.
Samayam Telugu currency ban ap cm conduct review meeting on the functioning of banks
బ్యాంకర్ల తీరు మారకుంటే కఠిన చర్యలు - ఏపీ సీఎం


సమీక్షా సమావేశం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దు అనంతరం పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రొత్సహించాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా బ్యాంకర్ల తీరుపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి చంద్రబాబు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.