యాప్నగరం

జగన్‌ను కలిసిన రాగాల వెంకట రాహుల్

కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన రాగాల వెంకట రాహుల్ ఆదివారం విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కామన్వెల్త్‌లో పసిడి పతకం సాధించిన రాహుల్‌ను ఈ సందర్భంగా జగన్ అభినందించారు.

Samayam Telugu 23 Apr 2018, 12:27 pm
కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన రాగాల వెంకట రాహుల్ ఆదివారం విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కామన్వెల్త్‌లో పసిడి పతకం సాధించిన రాహుల్‌ను ఈ సందర్భంగా జగన్ అభినందించారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి రాహుల్‌కు లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. కామన్వెల్త్‌లో తెలుగోడి సత్తా చాటిన రాహుల్‌కు ఆర్థికంగా అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.
Samayam Telugu jagan with ragala


గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరిగిన కామెన్వెల్త్‌ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో గుంటూరు జిల్లా స్టువర్ట్‌పురానికి చెందిన రాగాల వెంకట్‌ రాహుల్‌ స్వర్ణం సాధించారు. 85 కిలోల విభాగంలో బరిలో దిగిన ఆయన మొత్తం 338 కేజీల (స్నాచ్‌లో 151+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 187) బరువెత్తారు. కామన్వెల్త్ క్రీడల్లో 85 కిలోల విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం సాధించిపెట్టిన తొలివ్యక్తి వెంకట్ రాహుల్ కావడం విశేషం.

కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించిన రాహుల్‌కు జనసేన తరఫున రూ. 10 లక్షల సాయం చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం కూడా రూ. 30 లక్షల నజరానా ప్రకటించింది.

Read Also: కామన్వెల్త్: స్వర్ణంతో మెరిసిన స్టువర్టుపురం చిన్నోడు

గత 143 రోజులుగా ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న జగన్‌ ఆదివారం కృష్ణా జిల్లాలోని నూజివీడు, కొత్తూరు, కొన్నం గుంట, రావచర్ల, వడ్లమాను, అగిరిపల్లి ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.