యాప్నగరం

Phethai Video: ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం

ఏపీపై పెథాయ్ తుఫాన్ పెను ప్రభావాన్ని చూపింది. ఉప్పాడ తీరంలో రాకాసి అలలు బెంబేలెత్తించాయి.

Samayam Telugu 18 Dec 2018, 12:28 am
పీపై పంజా విసిరిన పెథాయ్‌ తుఫాన్ అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు కూడా వీయడంతో భారీ నష్టం సంభవించింది. రాకాసి తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమింకంగా అంచనా వేశారు. రూ. 51 కోట్లకు పైగా పంటనష్టం జరిగినట్లు సీఎం చంద్రబాబు నాయడు తెలిపారు. గురువారం (డిసెంబర్ 20)లోగా పంట నష్టాన్ని పూర్తిగా అంచనా వేస్తామని ఆయన చెప్పారు. నూర్పిడి దశకు వచ్చిన పంటలు చేతికందకుండా పోవడంతో రైతులు కంటతడి పెడుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద సోమవారం (డిసెంబర్ 17) మధ్యాహ్నం 12 గంటల సమయంలో పెథాయ్ తుఫాన్ తీరాన్ని తాకింది. తుఫాన్ ప్రభావంతో రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, అల్లవరం, మామిడి కుదురు, కాట్రేనికోన, ఉప్పలగుప్తం తదితర మండలాల్లో ఆదివారం రాత్రి నుంచే భారీ వర్షం కురుస్తోంది.

కాకినాడ నగరంపై పెనుగాలులు విరుచుకుపడుతున్నాయి. నగరానికి అటవీ ప్రాంతం అడ్డుగా ఉండటంతో తీవ్రత తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాకినాడ సమీపంలోని ఉప్పాడ బీచ్ వద్ద అలలు ఎగసిపడ్డాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

జాలర్లకు జీవన భృతి..
ప్రజలను మందుస్తుగా అప్రమత్రం చేసి ప్రాణ నష్టాన్ని భారీగా తగ్గించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. జాలర్లను వెనక్కి రప్పించగలిగామని తెలిపారు. మత్య్సకారులకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. వారికి జీవన భృతి కూడా అందించనున్నట్లు స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన మంగళవారం పర్యటించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.