యాప్నగరం

తిత్లీ తుఫాన్ ఎఫెక్ట్: రైళ్లు, విమాన సేవలకు విఘాతం

తిత్లీ తుఫాన్ దాటికి శ్రీకాకుళం జిల్లా, దక్షిణ ఒడిశా ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రైళ్లు, విమాన సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది.

Samayam Telugu 11 Oct 2018, 1:23 pm
‘తిత్లీ’ తుఫాన్ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి వద్ద గురువారం ఉదయం తీరం దాటింది. ఈ సందర్భంగా తీరం వెంబడి గంటకు 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. తుఫాన్ దాటికి వజ్రపుకొత్తూరు, సోంపేట, తదితర మండలాల్లో తీవ్రమైన గాలులు, భారీ వర్షంతో భయానక వాతావరణం నెలకొంది.
Samayam Telugu Untitled11

See Pics: తీరం దాటుతూ.. బీభత్సం సృష్టించిన తిత్లీ తుఫాన్ ఫొటోలు
తుఫాన్ వల్ల విశాఖపట్నం విమానాశ్రయంలో ఇండిగో సర్వీసులను రద్దు చేశారు. దీంతో ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని విమానాశ్రయానికి చేరి ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. మరోవైపు రైళ్ల సేవలు కూడా తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొన్ని రైళ్లను దారిమళ్లించగా, మరికొన్నింటిని రద్దు చేశారు.

తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విశాఖ-పలాస ప్యాసింజర్‌, ఎర్నాకులం-హుతియ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. విశాఖ-న్యూపలాస రైలును విజయనగరం వరకు నడిపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దువ్వాడ, విజయనగరం, ఖుర్దా స్టేషన్లలోనూ రైళ్లు నిలిపేశారు. పలు రైళ్లను రద్దు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.