యాప్నగరం

సమయం మార్నింగ్ న్యూస్ బులెటిన్

నేడు తీరం దాటనున్న వర్ద; 0866-2488000 నంబరుతో హైల్ప్ లైన్ ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు.

TNN 12 Dec 2016, 8:07 am
* వర్ద తుపాను నేపథ్యంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు. నేడు చెన్నై సమీపంలో తీరం దాటనున్న తుపాను. వర్ద కారణంగా.. నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు.
Samayam Telugu cyclone vardah landfall today samayam morning news
సమయం మార్నింగ్ న్యూస్ బులెటిన్


* వర్ద తుపాను కారణంగా ముందు జాగ్రత్తగా కాంచీపురం జిల్లాలోని 44 గ్రామాలు ఖాళీ చేయించిన అధికారులు. తిరువళ్లూరు జిల్లాలో 2000 మంది పునరావాస కేంద్రాలకు తరలింపు.

* వర్ద తుపాను నేపథ్యంలో 0866-2488000 నంబరుతో హైల్ప్ లైన్ ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు.

* దేశంలోని రెండో నగదు రహిత గ్రామంగా తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట నియోజకవర్గం ఇబ్రహీంపూర్‌. మంత్రి హరీష్ రావుకు అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.

* నేడు మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ప్రజలకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

* నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్: సెమీఫైనల్ చేరిన భారత బాక్సర్లు శివ థాపా, దేవేంద్రో సింగ్.

* ఢిల్లీని వదలని పొగమంచు. దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం. వాహనదారులకు తప్పని అవస్థలు. ఆలస్యంగా నడుస్తోన్న 82 రైళ్లు, 23 రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పు. 12 రైళ్ల రద్దు.

* ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ఆరుగురు ప్రయాణికుల నుంచి 16 కేజీల బంగారం స్వాధీనం.

* దేశ ప్రజలకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ.

* రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌తో సమావేశమైన బౌద్ధ గురువు దలైలామా.

* సోమాలియా రాజధాని మొఘాదిష్ పోర్టు సమీపంలో పేలుడు.. 20 మంది మృతి.

* రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు భారత్ రానున్న ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో.

* న్యూజిలాండ్ ప్రధాన మంత్రిగా జాన్ కీ రాజీనామా నేపథ్యంలో ఆయన స్థానంలో ఉప ప్రధాని బిల్ ఇంగ్లిష్‌ ఎంపిక.

* కెన్యాలో ఇంధన ట్యాంకు పేలిన ఘటనలో 33 మంది దుర్మరణం.

* వన్ చైనా పాలసీ విషయంలో అభ్యంతరం లేవనెత్తిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 1979 నుంచి తైవాన్ విషయంలో చైనా తీరును గౌరవిస్తోన్న అగ్ర దేశం.

* పాక్: ప్రస్తుత ఐఎస్ఐ చీఫ్‌ను తప్పించి ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముఖ్తర్‌ను నియమించిన పాక్ ఆర్మీ ఛీఫ్ జనరల్ జావెద్ బజ్వా.

* ఇటలీ నూతన ప్రధాన మంత్రిగా పాలో జెంటిలోని నియామకం. ఇటలీ రాజ్యంగం విషయంలో రెఫరెండంలో ఓటమి తర్వాత మటెవో రెంజి రాజీనామా.

* ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న పోర్చుగల్‌ మాజీ ప్రధాని ఆంటోనియో గటెర్స్‌. ఈ నెల 31తో ముగియనున్న ప్రసుత ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ పదవీ కాలం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.