యాప్నగరం

ఉత్తర కోస్తాకు వాయుగండం.. రైతుల్లో ఆందోళన

ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వాయుగుండం రూపంలో ముప్పు ముంచుకొస్తుందని తెలిసిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

TNN 16 Nov 2017, 3:52 pm
ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వాయుగుండం రూపంలో ముప్పు ముంచుకొస్తుందని తెలిసిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు ససమృద్ధిగా కురుసి సాగుకు అనుకూలించాయి. మరో వారం పదిరోజుల్లో ఉత్తర కోస్తాలో వరి కోతలు ప్రారంభం కాబోతున్నాయి. సరిగ్గా ఈ దశలోనే వరుణుడు కన్నెర్రజేస్తున్నాడని రైతులు వాపోతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఉత్తరకొస్తా వెంబడి గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
Samayam Telugu cyclonic storms in bay of bengal affected to north coastal area
ఉత్తర కోస్తాకు వాయుగండం.. రైతుల్లో ఆందోళన


ఈ వాయుగుండం నెమ్మదిగా కదులుతోందని, ఒడిశా, ఉత్తరకొస్తా మధ్యలో తీరందాటే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర కోస్తా వెంబడి అన్ని పోర్టుల్లోనూ రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కోతకు రావడంతోపాటు వాణిజ్య పంటగా వేసిన పెసలు, మినుములు మొలకెత్తుతాయా? అన్న ఆందోళనలో ఉన్నారు. వరుణుడి రాక రైతుకు ఆనందాన్నికలిగించినా, ఈ పరిస్థితుల్లో పిలవని చుట్టం వచ్చినట్టు బెంబేలెత్తిపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.