యాప్నగరం

పురందేశ్వరికి ఎయిర్ ఇండియా డైరెక్టర్‌ పదవి

దగ్గుబాటి పురందేశ్వరికి కీలక పదవి.. ఎయిరిండియా బోర్డ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియామకం

Samayam Telugu 20 Sep 2018, 5:02 pm
బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరికి కీలక పదవి దక్కింది. కేంద్రం పురందేశ్వరిని ఎయిర్ ఇండియా బోర్డ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌‌గా నియమించింది. కేబినెట్ కమిటీ నిర్ణయం మేరకు డైరెక్టర్‌గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. నాన్ అఫిషియల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ హోదాలో.. పురందేశ్వరి మూడేళ్ల పాటూ పనిచేయనున్నారు. ఎయిర్ ఇండియా పదవిలో నియమించినందుకు పురేందేశ్వరి కేంద్రానికి, బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞ‌తలు తెలిపారు.
Samayam Telugu Purandeswari


దగ్గుబాటి పురందేశ్వరి యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014లో బీజేపీలో చేరి.. ఏపీలో కీలక నేతగా ఉన్నారు. తర్వాత పార్టీలో సముచిత స్థానం కల్పించి.. బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నియమించారు. ఇప్పుడు ఎయిర్ ఇండియో డైరెక్టర్ బాధ్యతలు కూడా అప్పగించారు. పురందేశ్వరికి పదవి రావడంపై ఏపీ బీజేపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు అభినందనలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.