యాప్నగరం

టీడీపీ డేటా చోరీ చేసి చెత్త పనులు చేస్తున్నారు: లోకేష్

కలువ కుంట కాల్ సెంటర్ @ హైదరాబాద్. ఫోన్ నెంబర్లు: 040 30075005 / 38134000. హైద‌రాబాద్‌లో మా డేటా చోరీ చేశారు. ఇది నేరం కాదా?హైద‌రాబాద్‌లోనే దీనిని జ‌గ‌న్‌కు అందించారు. ఇది అప్ర‌జాస్వామికంకాదా?.

Samayam Telugu 6 Mar 2019, 4:38 pm

ప్రధానాంశాలు:

  • టీడీపీ కార్యకర్తల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు
  • ఫోన్ నెంబర్లు: 040 30075005 / 38134000
  • ఈ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకోదా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu lokesh
డేటా చోరీ వ్యవహారంపై నేతల మధ్య యుద్ధం నడుస్తోంది. ఏపీ మంత్రి నారా లోకేష్ తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ బాంబులు పేలుస్తున్నారు. ఏపీకి సంబంధించిన డేటాను చోరీ చేసి వైసీపీకి అందించారని ఆరోపిస్తున్నారు. మూడు రోజులుగా టీఆర్ఎస్‌పై ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. హైదరాబాద్‌లో కూర్చొని జగన్‌ టీఆర్ఎస్‌తో కుమ్మకై కుట్రలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. తాజాగా మరోసారి ట్వీట్లతో విరుచుకుపడ్డారు. వైసీపీ టీడీపీ కార్యకర్తల్ని ప్రలోభాలకు గురిచేస్తోందంటూ కాల్ రికార్డులతో సహా ట్వీట్ చేశారు.
లోకేష్ తన ట్వీట్‌లో ‘కలువ కుంట కాల్ సెంటర్ @ హైదరాబాద్. ఫోన్ నెంబర్లు: 040 30075005 / 38134000. హైద‌రాబాద్‌లో మా డేటా చోరీ చేశారు. ఇది నేరం కాదా?హైద‌రాబాద్‌లోనే దీనిని జ‌గ‌న్‌కు అందించారు. ఇది అప్ర‌జాస్వామికంకాదా?’అంటూ ప్రశ్నించారు.
‘హైద‌రాబాద్ వైకాపా కాల్ సెంట‌ర్ నుంచే APలోని టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌లోభాల‌కు గురిచేసే కాల్స్ చేస్తున్నారు. ఇది చ‌ట్టాల ఉల్లంఘ‌న‌ కింద‌కు రాదా? ఇన్ని అక్ర‌మాలు హైద‌రాబాద్‌లోనే జ‌రుగుతున్నాయి. మరి దీని పై TS ప్రభుత్వం యాక్షన్ తీసుకోదా? జగన్, @ktrtrs జోడి అనడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా?’అంటూ ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.