యాప్నగరం

నోట్ల రద్దు బాబుకు ముందే తెలుసు: జగన్

మోదీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు ముందే కొంతమంది సెలక్టెడ్ పీపుల్‌కు సమాచారం ఇచ్చిందని, అందులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

Samayam Telugu 23 Nov 2016, 11:14 am
మోదీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు ముందే కొంతమంది సెలక్టెడ్ పీపుల్‌కు సమాచారం ఇచ్చిందని, అందులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకరని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాజమహేంద్రవరంలో జగన్ మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu demonetization chandrababu knew it before ys jagan alleges
నోట్ల రద్దు బాబుకు ముందే తెలుసు: జగన్


పెద్దనోట్లను కేంద్రం రద్దు చేయగానే తన సూచన మేరకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చంద్రబాబు అన్నారని, అంతవేగంగా ఆయనెలా స్పందించగలిగారని జగన్ ప్రశ్నిచారు.

పెద్దనోట్లను కేంద్రం రద్దు చేయడం బాబు ముందే తెలుసని..అందుకే ఆయన అక్టోబర్ 12న రూ.500, రూ.1000నోట్లను రద్దు చేయాలంటూ కేంద్రానికి లేఖరాశారని జగన్ గుర్తు చేశారు. ఆ తరువాత తన ‘పనులు’ చక్కబెట్టుకున్నారని ఆరోపించారు.

నల్లడబ్బు అరికట్టడాన్ని తాము స్వాగతిస్తామని చెప్పిన జగన్..సరైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పెద్దనోట్ల రద్దు సామాన్యులను కష్టాల్లోకి నెట్టిందని అన్నారు.

ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోవాల్సిందని జగన్ పేర్కొన్నారు. ప్రజల తరపున ప్రతిపక్షం గొంతు విప్పుతుందని అన్నారు.

నోట్ల రద్దు అమలులో పారదర్శకత లోపించందన్నారు. రూ.2వేల నోట్లను ఎందుకు తెచ్చారో అర్థం కావడం లేదన్న జగన్...ఆ నోటుతో వెళ్తే చిల్లర దొరకడం లేదని గుర్తు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.