యాప్నగరం

నోట్ల రద్దు: ఏపీ బస్టాండ్‌లలో స్వైపింగ్ మెషిన్లు

పెద్ద నోట్ల రద్దుతో ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కష్టాలు బాగా పెరిగిపోయాయి.

TNN 24 Nov 2016, 7:26 pm
పెద్ద నోట్ల రద్దుతో ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కష్టాలు బాగా పెరిగిపోయాయి. డెబిట్ కార్డులో తప్ప చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి ప్రజలది. ఏపీ ఆర్టీసీ దీనికి చక్కని పరిష్కారం చూపింది. విజయవాడ బస్టాండ్ లో రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు స్వైపింగ్ మెషీన్లను ప్రారంభించారు. దూర ప్రయాణాలు చేసే వారు టిక్కెట్ కు వారి కార్డు ద్వారా డబ్బులు జమచేయచ్చు.
Samayam Telugu demonetization effect swiping machines introduced in apsrtc bus stands
నోట్ల రద్దు: ఏపీ బస్టాండ్‌లలో స్వైపింగ్ మెషిన్లు


నోట్లు రద్దయ్యాక ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లింది. దీనిని పూడ్చుకునేందుకు ఎండీ మాలకొండయ్య నడుం బిగించారు. నగదు రహిత లావాదేవీలను పెంచడం ద్వారా తిరిగి ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

తొలిదశలో భాగంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 50 స్వైపింగ్ మెషీన్లను అందుబాటులోకి తెచ్చారు. వారం రోజుల అనంతరం దాదాపు అన్ని జిల్లాల్లోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లలో మెషీన్లను అందుబాటులోకి తెస్తారు. లోకల్ ఆర్టీసీ బస్సుల్లో మాత్రం ఇంకా చిల్లర ఇచ్చి టిక్కెట్ తీసుకోవాల్సిన పరిస్థితే. బస్సుల్లో కూడా స్వైపింగ్ మెషీన్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది ఆర్డీసీ యాజమాన్యం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.