యాప్నగరం

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా బంద్ ప్రభావం

పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ వామపక్షాలు చేపట్టిన భారత్ బంద్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించడం లేదు.

Samayam Telugu 28 Nov 2016, 10:55 am
పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ వామపక్షాలు చేపట్టిన భారత్ బంద్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించడం లేదు. బంద్ ను కాంగ్రెస్ ఆక్రోశ్ దివాస్ గా నిర్వహిస్తోంది. హైదరాబాద్, ఇతర పట్టణాల్లో పలు వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. బంద్ నేపథ్యంలో పలు యూనివర్సిటీలు ఇవాళ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి.
Samayam Telugu demonetization lower impact of bandh in telugu states
తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా బంద్ ప్రభావం


ఆర్టీసీ బస్సులు అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఆటోలు బంద్ ను పాటిస్తున్నాయి.

శని, ఆదివారాలు వరసగా సెలవులు రావడంతో..సోమవారం కూడా బంద్ పాటిస్తే తమ నోట్ల మార్పిడి ఏవిధంగా చేసుకోవాలని ప్రజలు వామపక్షాలు, కాంగ్రెస్ పై మండిపడుతున్నారు.

అయితే బ్యాంకులకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చామని, బీజేపీ నేతలే ఉద్దేశ్యపూర్వకంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.