యాప్నగరం

మృత్యువుతో పోరాడుతున్న భక్తుడు

వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు టీటీడీ సిబ్బంది నిర్వాకానికి ఆసుపత్రి పాలైన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.

TNN 22 Mar 2017, 8:52 pm
వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు టీటీడీ సిబ్బంది నిర్వాకానికి ఆసుపత్రి పాలైన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. నిన్న (మార్చి 21) సర‍్వదర‍్శనం టిక్కెట్‌తో శ్రీవారి దర‍్శనం కోసం వెళుతున్న పద్మనాభం అనే భక్తుడు గుండెపోటుతో క్యూలైన్‌లో సొమ్మసిల్లి పడిపోయాడు. టీటీడీ సిబ్బంది అతడిపై దాడి చేసి, తోసేయడమే దీనికి కారణమని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడిని వెంటనే తిరుమలలోని అశ్విని హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో స్విమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ.. పద్మనాభం ఇంకా మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆయన వయసు 60 ఏళ్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు.
Samayam Telugu devotee padmanabham in tirupati hospital
మృత్యువుతో పోరాడుతున్న భక్తుడు


పద్మనాభం.. తూర్పు గోదావరి జిల్లా ఏలూరుకు చెందినవాడిగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇద‍్దరు విజిలెన్స్, ఒక ఎస్పీఎఫ్‌ సిబ‍్బందిని, ఇద‍్దరు మహిళా సెక్యూరిటీ గార్డులను.. పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. మహిళలకు సంబంధించిన క్యూ లైన్‌లో నుంచి వెళ్లడానికి ప్రయత్నించడంతో అతడిని అడ్డుకున్నామని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.