యాప్నగరం

అమెరికా వెళ్లడం అవసరమా?: అలోక్ తండ్రి

జాత్యాహంకారి అడమ్ పురింటన్ అనే ఉన్మాది కాల్పుల్లో తృటిలో ప్రాణపాయం నుంచి బయటపడ్డ అలోక్ రెడ్డి కుటుంబ సభ్యులు షాక్ లో మునిగిపోయారు.

Samayam Telugu 24 Feb 2017, 5:02 pm
జాత్యాహంకారి అడమ్ పురింటన్ అనే ఉన్మాది కాల్పుల్లో తృటిలో ప్రాణపాయం నుంచి బయటపడ్డ అలోక్ రెడ్డి కుటుంబ సభ్యులు షాక్ లో మునిగిపోయారు. ఇదే వ్యక్తి జరిపిన కాల్పుల్లో మరో తెలుగు యువకుడు శ్రీనివాస్ చనిపోయిన సంగతి తెలిందే. బుధవారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో కాన్సస్ లోని ఓ బార్ లో ‘మా దేశం విడిచి వెళ్లిపోండి’ అంటూ పురింటన్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు.
Samayam Telugu do we really need to go to us says alok reddys father
అమెరికా వెళ్లడం అవసరమా?: అలోక్ తండ్రి



ఈ సంఘటన పట్ల అలోక్ రెడ్డి తండ్రి, తెలంగాణ రూరల్ వాటర్ సస్లై డిపార్ట్ మెంట్ లో చీఫ్ ఇంజనీర్ మద్దసాని జగన్మోహన్ రెడ్డి దిగ్ర్భాంతికి గురయ్యారు.

‘ఇంత దుర్మార్గమైన సంఘటన తర్వాత నిజంగా మనం అమెరికా వెళ్లి అక్కడ పనిచేయడం అవసరమా? అని అనిపిస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్మాది జరిపిన కాల్పుల్లో తన కొడుకు అలోక్ ప్రాణాలతో బయటపడ్డందుకు సంతోషంగా ఉన్నా...శ్రీనివాస్ కూచిబొట్ల చనిపోవడం బాధగా ఉందని ఆయన తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి పెద్ద కొడుకు సురేందర్ రెడ్డి డల్లాస్ ఉంటున్నాడు. సురేందర్ చెప్పిన వివరాలను జగన్మోహన్ రెడ్డి మీడియాతో వివరించారు.

‘‘నా కొడుకు, శ్రీనివాస్ లు వారి అమెరికన్ స్నేహితుడితో కలిసి బార్ కు వెళ్లారు. అప్పటికే అడమ్ పురింటన్ మా దేశం విడిచిపెట్టి వెళ్లిపోండి అని అరుస్తున్నాడు. దీంతో వీళ్ల అమెరికన్ ఫ్రెండ్ బార్ యజమానికి ఫిర్యాదు చేశాడు. బార్ ఓనర్ అప్పటికే బాగా తాగేసిన ఆ వ్యక్తి (పురింటన్)ని బయటకు పంపించేశాడు. అయితే అలా బయటికి వెళ్లిన పురింటన్..కాసేపటికే తుపాకితో బార్ కు తిరిగి వచ్చాడు. వచ్చిరాగానే శ్రీనివాస్ పై కాల్పులు ప్రారంభించాడు. అలోక్ భోజనం కోసం ప్లేట్ పట్టుకున్నాడు. శ్రీనివాస్ పై కాల్పులు జరపడాన్ని గమనించి పారిపోవడానికి అలోక్ ప్రయత్నించాడు. అతడు జరిపిన మూడు రౌండ్ల కాల్పుల్లో ఒకటి అలోక్ తొడలోకి దిగింది’’ అని జగన్మోహన్ రెడ్డి వివరించారు.

పురింటన్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన అలోక్ అమెరికన్ ఫ్రెండ్ ఐయాన్ గ్రిల్లట్ కు సైతం గాయాలయ్యాయి. శ్రీనివాస్, అలోక్ లు చట్టపరంగా అమెరికాలో ఉంటున్నారని..ఐయాన్ ఎంతచెప్పినా పురింటన్ వినిపించుకోకుండా కాల్పులు జరిపాడు.

జగన్మోహన్ రెడ్డి కుటుంబం హైదరాబాద్ లోని కొత్తపేటలో నివాసం ఉంటోంది. అలోక్ పై కాల్పులు జరిగాయని తెలిసినప్పటి నుంచి అమెరికా వెళ్లి తన ఇద్దరు పిల్లలను చూడాలని ఉందని రెడ్డి చెబుతున్నారు.

పురింటన్ కాల్పుల్లో మృతిచెందిన శ్రీనివాస్ కుటుంబంతో మాట్లేందుకు ప్రయత్నించినా స్పందన లేదని రెడ్డి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.