యాప్నగరం

జగన్‌కు సానుకూలత ఉంది..కానీ..!

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ స్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉందని వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్

Samayam Telugu 18 Jun 2018, 4:21 pm
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ స్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉందని వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఎలక్షన్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ తెలుసు అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. జగన్‌కు సరైన ఎన్నికల టీమ్ అవసరం అని అన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం విషయంలో అంత త్వరగా అంచనాకు రావడానికి వీల్లేదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
Samayam Telugu undavall


తను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ కూడా కాదు అని, తను ఏ పార్టీలో లేను అని.. ఇక వేరే రాజకీయ పార్టీల్లో చేరే వయసు దాటిపోయిందేమో అని ఉండవల్లి చెప్పుకొచ్చారు. రాజకీయం, ఎంపీ పదవి, ఎమ్మెల్యే పదవి.. ఇలా ఏదైనా అదొక ఉద్యోగమే అని, సేవ అనడం సరికాదని, జీతం తీసుకునేది ఏదీ సేవ కింద రాదని అన్నారు. తను అలా ఉద్యోగం చేసే స్థితిలో లేనేమో అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. తనకు అన్ని పార్టీల్లోనూ మిత్రులున్నారని చెప్పారు. పాదయాత్రలో జగన్‌కు మంచి స్పందన వస్తోందని, అదే జగన్‌కు ఉన్న సానుకూలతకు సాక్ష్యమని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీల రెండింటి హస్తం ఉందని, హోదా సాధించితీరాలని అన్నారు. అయితే అది వేడి మీద ఉన్నప్పుడే జరగాల్సిందని అన్నారు. రానున్న లోక్‌సభ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వాలని చంద్రబాబుకు సూచించారు ఉండవల్లి. కేంద్రంతో పోరాడాలని తను ముందు నుంచినే చెబుతున్నాను అని, అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పోరాడుతున్నట్టుగా యాక్షన్ మాత్రమే చేస్తున్నారని వ్యాఖ్యానించారాయన.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.