యాప్నగరం

తాగుబోతుల వీరంగం.. ఎమ్మెల్సీ బంధువులమంటూ అటవీ అధికారిపై దాడి

ఫుల్లుగా మద్యం సేవించి అర్ధరాత్రి రోడ్డుమీద తిరుగుతోన్న ఆకతాయిలను ప్రశ్నించిన అటవీ శాఖ అధికారిపైనే వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్నూలులో జరిగింది.

Samayam Telugu 16 Aug 2018, 1:06 pm
ఫుల్లుగా మద్యం సేవించి అర్ధరాత్రి రోడ్డుమీద తిరుగుతోన్న ఆకతాయిలను ప్రశ్నించిన అటవీ శాఖ అధికారిపైనే వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లా సున్నిపెంట వద్ద మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు శ్రీశైలం వెళుతూ సున్నిపెంట వద్ద అక్కమ్మ హోటల్ వద్ద ఆగి అటవీశాఖ కార్యాలయం సమీపంలో మద్యం సేవిస్తుండగా సెక్షన్ అధికారి జ్యోతి స్వూరూప్ వారిని అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన తాగుబోతులు మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి కొడుకునే అడ్డుకుంటావా అంటూ ఆయనను కారులోకి లాక్కెళ్లి దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. అంతేకాదు అధికారిని నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ తమ కాళ్లు పట్టుకుంటేనే వదిలిపెడతామని బెదిరించి విచక్షణారహితంగా కొట్టారు.
Samayam Telugu అటవీ అధికారిపై దాడి


ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులను అరెస్ట్ చేశారు. తీవ్రంగా గాయపడిన ఆ అధికారి ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. నిందితులు దయానంద్, శ్రీనివాస్, అభినయ్ రెడ్డి, కౌసర్, అశోక్ కుమార్, రాజు అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి కుమారుడ్ని అంటూ వారు దాడిచేసినట్టు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. ఇదంతా పక్కన ఉన్న వ్యక్తి వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడిన వారిలో రంగారెడ్డి సోదరుడు హన్మంతరెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి‌గా పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు నా గొడవతో తనకు, తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి స్పష్టం చేశారు. గిట్టనివాళ్లు ఎవరో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, నా కుమారుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడని తెలిపారు. దాడిచేసిన తాగుబోతులతో తమకెలాంటి సంబంధం లేదని రంగారెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు మా సోదరుడి కుటుంబంతోనూ దాదాపు పదేళ్ల కిందటే సంబంధాలు తెగిపోయానని అన్నారు. మరోవైపు రంగారెడ్డి తనయుడు కూడా దీనిపై వివరణ ఇచ్చాడు. అటవీ అధికారిపై దాడిచేసినవారు ఎవరో తనకు తెలియదని, విజువల్స్‌లో కనిపిస్తున్నవారిని ఎప్పుడూ చూడలేదని రంగారెడ్డి కుమారుడు విజయ్‌దేవ్ రెడ్డి అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైవరైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

undefinedRead This Story in Mumbai Mirror

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.