యాప్నగరం

హెడ్‌ఫోన్స్ పెట్టుకుని బైకు నడిపితే జైలుకే!

కేవలం వాహనాలు నడిపేవారే కాదు, పాదచారులు సైతం హెడ్ ఫోన్స్ పెట్టుకుని రోడ్డు మీద నడవడం నేరమే అంటున్నారు.

Samayam Telugu 15 Feb 2018, 10:09 pm
చెవిలో ఇయర్ ఫోన్స్ లేదా బ్లూతూత్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని.. పాటలు వింటూ బైకు మీద జాలీగా దూసుకెళ్లడం మీకు ఇష్టమా? ఆ అలవాటు ఉంటే ఇకనైనా మానుకోండి. లేకపోతే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. ఔను! ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బైకు నడుపుతున్న వాహనదారులపై హైదరాబాద్ పోలీసులు సెక్షన్ 184 మోటర్ వెహికిల్ చట్టం కింద కేసులు పెడుతున్నారు. అంతేకాదు బైకును కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉన్నా, ఇటీవల ప్రమాదాలు ఎక్కువైన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
Samayam Telugu driving with earphones on may land you in jail 6 violators imprisoned
హెడ్‌ఫోన్స్ పెట్టుకుని బైకు నడిపితే జైలుకే!


లా దొరికితే కౌన్సెలింగ్‌ లేదా జైలు శిక్ష కూడా విధిస్తారు. గత 15 రోజుల్లో మొత్తం192 కేసులు నమోదయ్యాయి. ఆరుగురికి జైలు శిక్ష పడింది. చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవ్ చేయడం వల్ల ఏకాగ్రత లోపించి ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలుపుతున్నారు. కేవలం వాహనాలు నడిపేవారే కాదు, పాదచారులు సైతం హెడ్ ఫోన్స్ పెట్టుకుని రోడ్డు మీద నడవడం నేరమే అంటున్నారు. జాగ్రత్త, ఈ ఆర్టికల్ షేర్ చేసుకుని, మీ స్నేహితులకు కూడా ఈ విషయం చెప్పండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.