యాప్నగరం

ఆ నివేదిక అందిన వెంటనే పూరీ అరెస్ట్!

డ్రగ్స్ దందాలో సిట్ విచారణను ఎదుర్కొన్న దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను శనివారంలోగా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

TNN 23 Jul 2017, 2:03 pm
డ్రగ్స్ దందాలో సిట్ విచారణను ఎదుర్కొన్న దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను శనివారంలోగా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వ్యవహారంలో ఆయన పాత్రే ఎక్కువ ఉన్నట్లు నిర్ధరణకు వచ్చిన పోలీసులు, ఇతరులకు పూరీ సరఫరా చేశాడనటానికి పక్కాగా ఆధారాలను సేకరించడమే అరెస్ట్‌కు దారితీయనుందని సమాచారం. అంతేకాదు పూరీ డ్రగ్స్ తీసుకుంటాడని అనుమానిస్తున్న సిట్, ఆయన రక్తం, వెంట్రుకల నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపింది. పూరీ డ్రగ్స్ వాడుతున్నట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వెల్లడైతే, ఈ కేసులో బలమైన సాక్ష్యంగా మారుతుందని సిట్ భావిస్తోంది.
Samayam Telugu drug scandal tollywood director puri jagannath arrest maybe soon
ఆ నివేదిక అందిన వెంటనే పూరీ అరెస్ట్!


పూరీ జగన్నాథ్ విదేశాల నుంచి తెప్పించే మత్తు పదార్థాలను తనతో పాటు చార్మీ, ముమైత్‌ఖాన్‌లకు ఇచ్చేవాడని సుబ్బరాజు స్వయంగా వెల్లడించినట్లు సమాచారం. ఈ సాక్ష్యంతో పూరీ అరెస్ట్ తప్పదని సిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, పూరీ జగన్నాథ్‌ను విచారించిన రోజే, కేసులో ముఖ్యమైన వ్యక్తి అతనేనని, అరెస్ట్ జరుగుతుందని వార్తలు వెలువడ్డాయి. దీనికి అనుగుణంగానే సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందనుకున్న విచారణ రాత్రి 9 గంటల వరకూ కొన సాగింది. పూరీని అరెస్ట్ చేస్తారని భావించినా, ఆ రోజు సిట్ అధికారులు విడిచిపెట్టారు. తాము కేవలం ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసమే ఎదురు చూస్తున్నామని, ఆ నివేదిక రాగానే సినీ ప్రముఖుల అరెస్ట్ ఉంటుందని ఓ అధికారి తెలియజేశారు.

డ్రగ్స్ రాకెట్ కేసులో విచారణ సందర్భంగా సిట్ బృందం దర్శకుడు పూరీ జగన్నాథ్ నుంచి సేకరించిన రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను ఉస్మానియా హాస్పిటల్ వర్గాలు హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి అప్పగించాయి. ఈ నెల 19న సిట్ విచారణకు హాజరయిన పూరీ నుంచి సేకరించిన నమూనాలను శుద్ధిచేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు అందించినట్టు ఉస్మానియా హాస్పిటల్ ఆర్‌ఎంవో ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ఎఫ్ఎస్‌ఎల్లో రక్తపరీక్షలకు సంబంధించిన అన్నిరకాల పరికరాలు ఉన్నాయి. కానీ గోళ్లు, వెంట్రుకల విషయంలో మాత్రం మైక్రో ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన పరికరాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో లేనందున వాటిని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్ (సీడీఎఫ్‌డీ)కు పంపించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఉస్మానియా వైద్యులు పంపించిన నమూనాలపై ఫోరెన్సిక్ వైద్యులు అధ్యయనంచేసి, పూర్తిస్థాయి నివేదికను 10 రోజుల్లో ఇస్తారని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.