యాప్నగరం

ఆ నిర్మాత తనయుల కోసం సిట్‌పై రాజకీయ ఒత్తిడి!

దశాబ్దాలుగా చిత్ర నిర్మాణ రంగంలో ఉన్న ఓ అగ్ర నిర్మాత తనయులిద్దరికీ డ్రగ్స్ కేసులో భాగం ఉందని, వారికి నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతోందని వార్తలు వస్తున్న వేళ రాజకీయ నేతల పైరవీలు ప్రారంభమయ్యాయి.

TNN 23 Jul 2017, 12:16 pm
దశాబ్దాలుగా చిత్ర నిర్మాణ రంగంలో ఉన్న ఓ అగ్ర నిర్మాత తనయులిద్దరికీ డ్రగ్స్ కేసులో భాగం ఉందని, వారికి నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతోందని వార్తలు వస్తున్న వేళ రాజకీయ నేతల పైరవీలు ప్రారంభమయ్యాయి. వీరికి నోటీసులు వద్దని అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం. ఈ వారంలోనే వారికీ నోటీసులు జారీ చేసి, ఆగస్టు 2 తర్వాత విచారణకు హాజరు కావాలని సిట్ భావిస్తోందట. అయితే, వారి పేర్లు బయటకు వస్తే, చిత్ర పరిశ్రమ మొత్తం అల్లకల్లోలం అవుతుందని సినీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమకున్న పరిచయాలను ఉపయోగించి బడా రాజకీయ నాయకులతో ఫోన్లు చేయిస్తూ, నోటీసులు వారికి పంపవద్దని చెప్పిస్తున్నట్టు సమాచారం. రాజకీయ ఒత్తిడి లేకుంటే మాత్రం వారికి తప్పకుండా నోటీసులు జారీచేస్తామని పేరు వెల్లడించడానికి ఇష్టపడని సిట్ అధికారి తెలిపారు.
Samayam Telugu drug scandal tollywood producer sons involvement
ఆ నిర్మాత తనయుల కోసం సిట్‌పై రాజకీయ ఒత్తిడి!


ఒత్తిడి పెరిగితే మాత్రం పై అధికారులు చెప్పినట్టు వినాల్సిందేనని, మా చేతుల్లో ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. వచ్చే వారం ఈ కేసులో మరిన్ని సంచలనాలు, ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో కెల్విన్, పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌ల‌ను విచారించిన సిట్ అధికారులకు కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. తొలి జాబితాలో నోటీసులు పొందిన వారి విచారణ ఆగస్టు 2 వరకూ సాగనుండగా, ఆపై రెండో దఫా విచారణ కోసం మరి కొందరిని పిలవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ జాబితాలో ఆ అగ్ర నిర్మాత తనయులకు వచ్చే వారం నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.