యాప్నగరం

డ్రగ్స్ కేసు: 16 పబ్‌లకు ‘సిట్’ నోటీసులు

డ్రగ్స్ కేసులో ఇప్పటివరకూ సినీ ప్రముఖులను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పుడు పబ్‌లపై పడింది. హైదరాబాద్‌లో మత్తుమందులకు అడ్డాగా మారిన పలు పబ్‌లకు నోటీసులు పంపించింది..

TNN 18 Aug 2017, 1:35 pm
డ్రగ్స్ కేసులో ఇప్పటివరకూ సినీ ప్రముఖులను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పుడు పబ్‌లపై పడింది. హైదరాబాద్‌లో మత్తుమందులకు అడ్డాగా మారిన పలు పబ్‌లకు నోటీసులు పంపించింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఇటీవల సినీ ప్రముఖులు, కెల్విన్ తదితర వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు నగరంలో మత్తుమందులను వ్యాప్తి చేయడానికి కారణమవుతున్న పలు పబ్‌లను అధికారులు గుర్తించారు. తాజాగా ఈ అంశంపై తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటివరకూ 16 పబ్‌లకు నోటీసులు పంపించినట్లు సిట్ అధికారులు తెలిపారు. శనివారం (ఆగస్టు 19) ఉదయం 11 గంటలకు సిట్ ఆఫీసులో హాజరు కావాలని ఆయా పబ్ ఓనర్లను ఆదేశించారు.
Samayam Telugu drugs case sit notices to 16 pubs in hyderabad
డ్రగ్స్ కేసు: 16 పబ్‌లకు ‘సిట్’ నోటీసులు


ఎక్సైజ్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన కెల్విన్ సహా పలువురు నిందితులు.. తాము డ్రగ్స్ విక్రయించడానికి తరచూ కొన్ని పబ్‌లకు వెళుతుంటామని తెలిపారు. సదరు పబ్‌లు మత్తుమందుల విక్రయానికి అడ్డాగా మారినట్లు తేలితే వాటి లైసెన్స్ రద్దు చేయనున్నారు. ఇందులో పబ్ మేనేజర్లకు కూడా ప్రమేయం ఉందని తేలితే.. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

SIT officials served notices to 16 pubs in Hyderabad in drugs case. Owners of the pubs were asked to appear before the SIT at 11 am on August 19.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.