యాప్నగరం

Telangana Election 2018: నేడు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్

నవంబరు 12తో ప్రారంభయ్యే ఎన్నికల ప్రక్రియ డిసెంబరు 13తో ముగియనుంది.

Samayam Telugu 12 Nov 2018, 10:17 am
సోమవారం (నవంబరు 12) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం నోటిఫికేషన్‌ జారీ అయిన మరుక్షణం నుంచే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. అభ్యర్ధుల నామినేషన్ల స్వీకరణకు 19 వరకు గడువు ఉంది. 20న పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 22 వరకు గడువు ఉంది. డిసెంబర్‌ 7న పోలింగ్‌, 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. 13వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలుకు సిద్దమయ్యారు.
Samayam Telugu ec


ఎన్నికల షెడ్యూలు ఇలా..
* ఎన్నికల నోటిఫికేషన్‌: నవంబరు 12.
* నామినేషన్ల స్వీకరణ: నవంబరు 12 నుంచి 19 వరకు.
* నామినేషన్ పత్రాల పరిశీలన: నవంబరు 20.
* నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబరు 22 వరకు.
* ఎన్నికలు: డిసెంబర్‌ 7న.
* ఓట్ల లెక్కింపు: డిసెంబరు 11న.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.