యాప్నగరం

అన్నాచెల్లెళ్ల యుద్ధం మొదలైంది: విజయశాంతి

స్టార్ క్యాంపెయినర్‌గా తనకు బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి విజయశాంతి ధన్యవాదాలు తెలిపారు.

Samayam Telugu 29 Sep 2018, 5:45 pm
రాబోయే రోజుల్లో జరగనున్న యుద్ధానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, మాజీ ఎంపీ విజయశాంతి తెలిపారు. ఎన్నికల యుద్ధంలో శత్రువులను ఓడించి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా శత్రువుల నుంచి ప్రజలను రక్షిస్తామని ఆమె చెప్పారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ ప్రచార కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు.
Samayam Telugu Vijayashanti And KCR


సమావేశం ముగిసిన అనంతరం విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో శత్రువులతో యుద్ధానికి సిద్దమవుతున్నాం. యుద్ధమంటే శత్రువును ఓడించడమే అని అర్థం. శత్రువును ఓడించి ప్రజలకు మేలు చేస్తాం. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ తనను దేవుడిచ్చిన చెల్లి అన్నారని, ఈ ఎన్నికల్లో అన్నాచెల్లెళ్ల మధ్య పోరాటానికి తెలంగాణ ప్రజలే తీర్పు చెబుతారు. స్టార్ క్యాంపెయినర్‌గా బాధ్యతలు ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. తొలిసారి గాంధీభవన్‌కు వచ్చాను. ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత మీడియా మిత్రులను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది’ అన్నారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాతో మూడు సభలు పెట్టాలని టీపీసీసీ ప్రచార కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తో కనీసం 10 సభలు నిర్వహించాలని , కర్ణాటక తరహాలో రాహుల్‌తో చిన్న చిన్న సభలు, సమావేశాలు నిర్వహంచాలని కమిటీ భావిస్తోంది. మొత్తం 60 నుంచి 70 మధ్య సభలు ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ యోచిస్తోంది. ఎన్నికల ప్రచారానికి మూడు హెలికాప్టర్లు వినియోగించనుండగా.. ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్కకు ఒకటి, టీపీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డికి మరొకటి, మూడో హెలికాప్టర్ జాతీయ నాయకులకు అందుబాటులో ఉంచాలని ప్రచార కమిటీ ప్లాన్ చేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.