యాప్నగరం

ఎంత మార్పు.. పవన్‌ను ఉద్దేశించి అశోక గజపతి మరోలా..!

పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు. నేను సినిమాలు చూడటం మానేసి చాలా కాలమైందని గతంలో వ్యాఖ్యానించిన అశోక గజపతి ఇటీవల జనసేనానిని ఉద్దేశించి మరోలా వ్యాఖ్యానించారు.

Samayam Telugu 26 Mar 2018, 1:40 pm
పవన్ కల్యాణ్ ఎవరో నాకు తెలీదంటూ గతంలో మంత్రిగా ఉన్న సమయంలో అశోక గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఏకే సింఘాల్‌ను నియమించడాన్ని పవన్ తప్పుబట్టారు. మంత్రి హోదాలో ఏలూరు వెళ్లిన రాజు గారి దగ్గర విలేకరులు పవన్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా.. ‘ఆయనెవరో తెలీదు. కొందరేమో సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడని అంటున్నారు. నేను సినిమాలు చూడటం మానేసి చాలా ఏళ్లయ్యింది. కాబట్టి తనెవరో నాకు తెలీదం’టూ ఘాటుగా బదులిచ్చారు.
Samayam Telugu ashonka gajapathi raju and pawan kalyan


అదే అశోక గజపతి రాజు ఇటీవల పవన్‌ను ఉద్దేశించి మరోలా మాట్లాడారు. ‘పవన్ కల్యాణ్ పెద్ద‌వార‌ు, ఆయ‌న‌కున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ నాకు లేద‌ు. నేనో సామాన్య కార్య‌క‌ర్త‌న‌’ని మాజీ మంత్రివర్యులు వ్యాఖ్యానించారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేనాని టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అవినీతికి పాల్పడుతోందని, మీ కుమారుడు లోకేశ్ చేసే అవినీతి గురించి మీకు తెలుసా? అంటూ చంద్రబాబు మీదే విమర్శలు ఎక్కుపెట్టారు.

తదనంతరం ప్రత్యేక హోదా కోసం అశోక గజపతి రాజు, సుజనా చౌదరి తమ పదవికి రాజీనామా చేయడం, కేంద్రం నుంచి టీడీపీ బయటకు వచ్చేయడం చకచకా జరిగిపోయాయి. పౌర విమానయాన శాఖకు రాజీనామా చేసిన అశోక గజపతి ఇటీవల సొంత నియోజకవర్గమైన విజయనగరం చేరుకున్నారు. ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికడంతోపాటు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా విలేకరులను ఉద్దేశించి అశోక్ గజపతి రాజు మాట్లాడారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్న ఆయన.. తాము ఎవరికీ భయపడబోమన్నారు. అప్పుడే పవన్‌ ప్రస్తావన రాగా.. టీడీపీ అవినీతిని సాక్ష్యాధారాలతో నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తనకు లేదన్నారు.

అశోక గజపతి రాజు గతంలో మాట్లాడిన మాటలకు, ఇప్పుడు మాట్లాడిన మాటలకు ఇంత తేడా ఉండటం చూసి అక్కడున్న వారంతా షాకయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడు పవన్ ఎవరో తెలీదన్న ఆయన.. మంత్రి పదవికి రాజీనామా చేశాక మాత్రం ఇలా మాట్లాడటం ఎవరికీ అంతుచిక్కడం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.