యాప్నగరం

వైసీపీలో చేరిన మాజీ మంత్రి

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మానుగుంట మహీధర్ రెడ్డి వైసీపీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో జగన్‌‌ను కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు.

Samayam Telugu 12 Jul 2018, 9:21 am
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మానుగుంట మహీధర్ రెడ్డి వైసీపీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో జగన్‌‌ను కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనకు వైసీపీ అధినేత సాదరంగా స్వాగతం పలికారు. మహీధర్‌రెడ్డితో పాటూ మరికొంతమంది అనుచరులు కూడా పార్టీలో చేరారు. తర్వాత ప్రకాశం జిల్లా నేతలతో జగన్ సమావేశమై.. తాజా రాజకీయాలపై చర్చించారు. నేతలంతా సమన్వయంతో పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలని జగన్ సూచించారు.
Samayam Telugu Manugunta


పార్టీలో చేరిక తర్వాత మహీధర్ రెడ్డి మాట్లాడారు. వైసీపీలో చేరడం ఆనందంగా ఉందని.. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రజలు పాలనలో మార్పు కోరుకుంటున్నారని.. జగన్‌తోనే తమకు మంచి జరుగుతుందని బలంగా నమమ్ముతున్నారన్నారు. వైఎస్ ఆశయాలను జగన్ మాత్రమే నెరవేర్చగలడనే నమ్మకం అందరిలోనూ ఉందన్నారు. అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు.. దాన్ని తన సొంత ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

ప్రకాశం జిల్లాకు చెందిన మానుగుంట మహీధర్ రెడ్డి.. కందుకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. రాజకీయాల్లో కూడా అంతగా యాక్టివ్‌గా కూడా లేరు. మళ్లీ 2019 ఎన్నికలు వస్తుండటంతో పోటీపై ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇటీవల తిరుపతిలో పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసి వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. బుధవారం నాడు మంచి ముహూర్తం కూడా ఉండటంతో పార్టీలో చేరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.