యాప్నగరం

రియల్టర్‌ను గన్‌తో బెదిరించిన తెరాస నేత

హైదరాబాద్‌లోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని తుపాకీతో బెదిరించిన అధికార తెరాస నేతపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదుచేశారు.

TNN 28 Aug 2017, 11:27 am
హైదరాబాద్‌లోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని తుపాకీతో బెదిరించిన అధికార తెరాస నేతపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదుచేశారు. గతంలో తెదేపా తరఫున మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసి తరవాత తెరాసలో చేరిన శ్రీరామ్ భద్రయ్య తనను తుపాకీతో బెదించారని కొత్తపేటకు చెందిన రియల్టర్ వెంకటేశ్ గుప్తా ఆదివారం పోలీసులకు ఫిర్యాదే చేశాడు. దీంతో భద్రయ్య పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu ex mla trs leader sriram bhadraiah held for assault
రియల్టర్‌ను గన్‌తో బెదిరించిన తెరాస నేత


పోలీసులు వివరాల ప్రకారం.. భద్రయ్యకు కొత్తపేట ఒక ఇల్లు ఉంది. ఆయన ఇంటి పక్కనే ఒక ఓపెన ప్లాట్ కూడా ఉంది. దీని గురించే రిలయర్ట్‌కు, భద్రయ్యకు మధ్య వివాదం నడుస్తోంది. ఆదివారం ప్లాట్ వద్దకు వచ్చిన వెంకటేశ్ గుప్తాకు భద్రయ్యతో వాగ్వాదానికి దిగారు. వీరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో భద్రయ్య తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీ వెంకటేశ్ గుప్తాను చంపేస్తానని బెదిరించారు. అంతటితో ఊరుకోకుండా గుప్తా చేతిపై బలంగా కొట్టారు. అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్న గుప్తా.. అనంతరం చైతన్యపురి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 324 కింద భద్రయ్యపై కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.