హైదరాబాద్ శివార్లలో నకిలీ పాల ఉత్పత్తి జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం తయారీ కేంద్రంపై ఆకస్మికంగా దాడులు చేసి ఆ ముఠా గుట్టు రట్టు చేశారు. నల్గొండ జిల్లా బీబీనగర్ మండలం జైనపల్లిలో నకిలీ పాల తయారీ కేంద్రం నిర్వహిస్తున్న ఈ నకిలీ పాల ముఠాకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, నకిలీ పాల తయారీకి వినియోగించే ముడి సరుకులు, యంత్ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అయితే, ఈ నకిలీ దందాకు అసలు సూత్రదారి అయిన నిందితుడు మాత్రం ప్రస్తుతం పరారీలో వున్నాడని తెలుస్తోంది. హైదరాబాద్కి ఆనుకుని వున్న శివారు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జరుగుతున్న పాల సరఫరాపై కన్నేసిన ఎస్ఓటీ పోలీసులు ఇటీవల కాలంలోనూ ఇలాంటి దాడులు నిర్వహించి నకిలీ పాల తయారీ ముఠాల ఆగడాలకి చెక్ పెట్టారు.