యాప్నగరం

రైతుల అవస్థలు ప్రభుత్వానికి పట్టవు: జగన్

తెలుగుదేశం ప్రభుత్వం హయంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్

Samayam Telugu 1 May 2017, 5:03 pm
తెలుగుదేశం ప్రభుత్వం హయంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా వ్యవహారిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. సోమవారం వైసీపీ ఆధ్వర్యంలో గుంటూరులో రైతు దీక్ష జరిగింది. ఈ దీక్షలో జగన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Samayam Telugu farmers face problems in tdps rule ys jagan
రైతుల అవస్థలు ప్రభుత్వానికి పట్టవు: జగన్


‘చంద్రబాబు పాల‌న‌లో రైతులు అవ‌స్థ ప‌డుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఒక మాట‌ అధికారంలో లేపుడు మ‌రో మాట చెబుతారు. ధాన్యానికి క‌నీస మ‌ద్దతు ధ‌ర చాలా త‌క్కువ‌గా ఉంటోంది. స్వామినాథ‌న్ క‌మిటి సిఫార్సులు అమ‌లు చేస్తాన‌న‌న్నారు. ఖ‌ర్చుపై 50 శాతం క‌లిపి ధ‌ర నిర్ణయిస్తామ‌న్నారు. ఎన్నిక‌ల త‌రువాత రైతాంగాన్ని విస్మ‌రించారు. క‌నీస మ‌ద్దతు ధర‌లు అంద‌డం లేదు. ధాన్యం మ‌ద్ధతు ధ‌ర‌ల‌ను ఏటా రూ.50 పెంచుతున్నారు. అయినా చంద్రబాబు పెద‌వి విప్పడం లేదు. ముష్టి వేసిన‌ట్లు మ‌ద్దతు ధ‌ర‌ను పెంచుతున్నారని’ ఆరోపించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదని విమర్శించిన జగన్ ... రూ.4394 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఎగనామం పెట్టారని దుయ్యబట్టారు. క్వింటాల్ మిర్చి రేటు రూ.2500-4000 కు త‌గ్గింది.
మార్క్ ఫెడ్‌ను రంగంలోకి దించ‌నందున ఈ ధ‌ర త‌గ్గుతోందని, రైతు నుంచి కేవ‌లం 20 క్వింటాళ్లు మిర్చి మాత్రమే కొనుగోలు చేస్తున్నారని’ ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.