యాప్నగరం

కొడుకును ఇంట్లో బంధించి తండ్రి పరార్

కన్నకొడుకునే ఇంట్లో ఒంటరిగా వదిలి తాళం వేసి వెళ్లిపోయాడు ఓ కసాయి తండ్రి.

TNN 20 Apr 2017, 3:34 pm
కన్నకొడుకునే ఇంట్లో ఒంటరిగా వదిలి తాళం వేసి వెళ్లిపోయాడు ఓ కసాయి తండ్రి. అయిదు రోజుల పాటూ సరిగా తిండిలేక నీళ్లు తాగుతూ గడిపాడు పదేళ్ల బాలుడు. చివరికి పోలీసుల సాయంతో బయటికి వచ్చాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో సాయిబాబా నగర్లో చోటు చేసుకుంది. సల్మాన్ అనే వ్యక్తి మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. రెండో భార్యతోనే ఉండేందుకు సల్మాన్ తన కడుపున పుట్టిన బిడ్డలనే భారంగా భావించాడు. వారిని తరుచూ వేధిస్తూ ఉండే వాడు. తల్లి లేని పిల్లలు ఇంకే దిక్కులేక తండ్రి వేధింపులు భరిస్తూ వస్తున్నారు. ఆదివారం నాడు తండ్రి తన రెండో భార్యకు ఒంట్లో బాగోలేదని చెప్పి కొడుకైన పదేళ్ల రెహాన్ ను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లాడు. అయిదు రోజులైన రాలేదు.
Samayam Telugu father abandoned his own son at home in kurnool
కొడుకును ఇంట్లో బంధించి తండ్రి పరార్


రెండు రోజుల పాటు ఇంట్లో ఉన్న కొంచెం ఆహారంతో కడుపు నింపుకున్న రెహాన్ మూడో రోజు నుంచి నీళ్లుతాగే బతికాడు. రెహాన్ ఉండే ఇల్లు మూడో అంతస్తులో ఉండడంతో అరిచినా కిందకి వినిపించదు. అయినా అటక ఎక్కి ఇంటి తలుపుపై ఉన్న వెంటిలేటర్ నుంచి ఎవరైనా పైకి వస్తారేమో అని చూసే వాడు. అదృష్టం కొద్దీ కరెంటు బిల్లిచ్చే వాళ్లు వచ్చారు. కిందింటి పనిమనిషి కూడా వచ్చింది. వారికి తన కథనంతా చెప్పాడు రెహాన్. వారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఇంటి యజమానులకు చెప్పారు. వారు పోలీసులకు సమాచారం అందించాడు. తాళం పగుల గొట్టి బాలుడిని పైకి తెప్పించారు పోలీసులు. చుట్టుపక్కల వారు రెహాన్ కు అన్నం పెట్టారు.

పోలీసులు, ఇంటి యజమానులు ఎన్నిసార్లు ఫోన్ చేసిన రెహాన్ తండ్రి ఫోన్ ఎత్తలేదు. కాసేపటికి స్విచ్ఛాప్ కూడా చేశాడు. దీంతో పోలీసులు తండ్రిపై కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.