యాప్నగరం

మార్చి 31లోపు ‘రియింబర్స్‌మెంట్’ బకాయిలు

ఫీజు రియింబర్స్ మెంట్ చెల్లింపుల్లో ఏలాంటి ఇబ్బందులుండవని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Samayam Telugu 5 Jan 2017, 12:37 pm
ఫీజు రియింబర్స్ మెంట్ చెల్లింపుల్లో ఏలాంటి ఇబ్బందులుండవని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పాత ప్రభుత్వంలో కొనసాగిన నిబంధనలు ఇకపైనా కొనసాగుతాయని ఆయన తెలిపారు.
Samayam Telugu fee reimbursement programme will not be lifted says kcr
మార్చి 31లోపు ‘రియింబర్స్‌మెంట్’ బకాయిలు


బుధవారం శాసనసభలో ఫీజు రియింబర్స్ మెంట్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పారు. అయితే అర్హులైన విద్యార్థులకే ఫీజు రియింబర్స్ మెంట్ చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఫీజు రియింబర్స్ మెంటు పథకాన్ని ఎత్తివేసే ప్రసక్తే లేదని కేసీఆర్ అన్నారు.

కొన్ని కాలేజీల్లో ఒకే ఆచార్యుడు పది కాలేజీల్లో తన పేరు నమోదు చేసుకొని డబ్బులు దండుకుంటున్నారని ఆ విధానానికి స్వస్తీ పలికేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వాల విధానాల వల్ల బకాయిలు పెరుగుతూ వచ్చాయి వాటిని తాము బరిస్తున్నామని సీఎం చెప్పారు.

హైదరాబాడ్ పబ్లిక్ స్కూళ్లలో జనరల్ కోటాలో సీట్లు పొందే ఎస్సీ విద్యార్థులకూ ఫీజు రియింబర్స్ మెంట్ చేస్తామని దీనికి సంబంధించి తక్షణమే ఆదేశాలు జారీచేస్తామని కేసీఆర్ అసెంబ్లీలో వెల్లడించారు.

తక్షణమే 2015-16 విద్యాసంవత్సరం బకాయిలు మార్చి 31లోపు చెల్లిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

అర్హులైన పేద విద్యార్థులు నష్టపోకుండా చూసే బాధ్యత నాది అని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. తప్పుడు మార్గాల్లో నడుస్తున్న కళాశాలలను మూసి వేస్తామని ఆయన హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.