యాప్నగరం

రాజకీయాల్లోకి 'కత్తి'.. పోటీ అక్కడి నుంచేనా?

రాజకీయాల్లోకి సినీ క్రిటిక్ కత్తి మహేష్.. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటన..

Samayam Telugu 30 Sep 2018, 4:31 pm
కత్తి మహేష్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సినిమా విమర్శకుడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకొని.. తర్వాత కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఏకంగా మెగా ఫ్యామిలీని ఢీకొట్టారు. తర్వాత రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలతో హైదరాబాద్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో ఉండే కత్తి.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
Samayam Telugu Kathi Mahesh


ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించిన కత్తి మహేష్.. తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. 2019లో తాను రాజకీయాల్లోకి వస్తానని.. చిత్తూరు జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లనని.. దళిత హక్కుల్ని కాపాడే పార్టీకి మద్దతిస్తానన్నారు. దళితులు రాజ్యాధికారం సాధించాలని.. 2019 ఎన్నికల్లో దళితులదే వాయిస్‌ అన్నారు. అలాగే రాజకీయాల్లో నేతలు పరిణతి చెంది ఉండాలని అభిప్రాయపడ్డారు. పవన్ తనపై హత్యాయత్నం జరుగుతుందన్న వ్యాఖ్యల్ని మీడియా ప్రస్తావించగా.. పవన్ ఈ కుట్రకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని వ్యాఖ్యానించారు.

2019లో రాజకీయాల్లోకి వస్తానన్న కత్తి చిత్తూరు జిల్లా నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారన్నది ఆసక్తిగా మారింది. చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు ఎంపీ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ రెండు ఆప్షన్లలో ఎటువైపు మొగ్గు చూపుతారనే చర్చ మొదలయ్యింది. అయితే ఆయన చిత్తూరు వైపే మొగ్గు చూపుతున్నారనే ప్రచారం కూడా ఉంది. తన సొంత గ్రామం చిత్తూరు లోక్‌సభ పరిధిలోకి వస్తుంది కాబట్టి.. అక్కడి నుంచే పోటీ చేయొచ్చని అభిప్రాయలు కూడా కొందరి నుంచి వ్యక్తమవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.