యాప్నగరం

డైరెక్టర్‌పై నటి ఫిర్యాదు.. రెచ్చిపోయిన డీసీపీ!

సినీ పరిశ్రమలో తమపై జరుగుతోన్న లైంగిక వేధింపులను నిర్భయంగా వెల్లడిస్తూ, వాటి ఎదుర్కోడానికి నటీమణులు ముందుకొస్తున్నారు. తాజాగా ఓ దర్శకుడు తనను వేధించాడని ఓ టాలీవుడ్‌ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

TNN 23 Dec 2017, 9:03 am
సినీ పరిశ్రమలో తమపై జరుగుతోన్న లైంగిక వేధింపులను నిర్భయంగా వెల్లడిస్తూ, వాటి ఎదుర్కోడానికి నటీమణులు ముందుకొస్తున్నారు. తాజాగా ఓ దర్శకుడు తనను వేధించాడని ఓ టాలీవుడ్‌ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి తనను వేధించాడని నటి హారిక గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లొంగదీసుకునేందుకు యోగి యత్నించాడని, పారితోషికం కూడా ఇవ్వలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. హారిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, యోగిని పిలిచి విచారించారు. పోలీసుల ఎదుట కూడా హారిక పట్ల యోగి దురుసుగా ప్రవర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే వీటిని యోగి ఖండించాడు. పారితోషకం ఎప్పుడో ఇచ్చేశానని.. తాను చెప్పేది వినకుండా అధికారి తనపై చెయ్యి చేసుకున్నారని యోగి చెబుతున్నారు.
Samayam Telugu film director yogi beaten by madhapur additional dcp gangi reddy
డైరెక్టర్‌పై నటి ఫిర్యాదు.. రెచ్చిపోయిన డీసీపీ!


ఈ నేపథ్యంలో మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి యోగి పట్ల దారుణంగా ప్రవర్తించారు. కానిస్టేబుళ్ల ఎదుటే దర్శకుడు యోగిని కాలితో తన్ని, చెంపలు పగలగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం బయటకు వచ్చింది. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. విచారించడానికి ఓ విధానం ఉంటుందని, ఇంత హేయంగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. డీసీపీ గంగిరెడ్డి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిందితుల పట్ల దురుసగా ప్రవర్తించి, మానవహక్కులను హరిస్తున్నారని మండిపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.