యాప్నగరం

నర్సులపై దూసుకెళ్లిన కారు

పోలియో చుక్కలు వేసేందుకు వెళుతున్న నర్సులపై కారు దూసుకుపోయింది.

TNN 31 Jan 2017, 10:12 am
కారు అదుపుతప్పి నర్సింగ్ విద్యార్థినులపైకి దూసుకువెళ్లడంతో 13 మంది గాయాలపాలయ్యారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని అపోలో నర్సింగ్ కళాశాలకు చెందిన విద్యార్థినులు పోలియోచుక్కలు వేసేందుకు వెళుతూ కిట్స్ కోసం మహాత్మాగాంధీనగర్ బస్తీలోని అపోలో అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్‌కు చేరుకున్నారు. అదేసమయంలో మహాత్మాగాంధీనగర్‌బస్తీకి చెందిన శ్రీకాంత్ (19) కారులో షేక్‌పేట వైపు అతివేగంగా వెళ్తున్నాడు.
Samayam Telugu film nagar car accident
నర్సులపై దూసుకెళ్లిన కారు

ట్రైనింగ్ సెంటర్ సమీపంలో ఓ వ్యక్తిని తప్పించే క్రమంలో అదుపుతప్పిన కారు.. అక్కడే నిల్చున్న నర్సింగ్ విద్యార్థినులను ఢీకొట్టింది. దీంతో బీఎస్సీ నర్సింగ్ మూడో సంవత్సరం విద్యార్థిని లీనా (23), యోగిత (21)కు తీవ్రగాయాలయ్యాయి. మరో 11మంది విద్యార్థినులు గాయపడ్డారు. కారుడ్రైవర్ శ్రీకాంత్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.