యాప్నగరం

కేటీఆర్ విశ్వవిజ్ఞానఖని: పరుచూరి గోపాలకృష్ణ

తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు వాక్ చాతుర్యం గురించి అందరికీ తెలిసిందే.

TNN 30 Nov 2017, 11:02 am
తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు వాక్ చాతుర్యం గురించి అందరికీ తెలిసిందే. బహిరంగ సభల్లో మాట్లాడంలో, ప్రత్యుర్థలకు చురకలు అంటించడంలో కేటీఆర్ తనదైన ముద్ర వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తరవాత టీఆర్ఎస్ పార్టీలో అంత వాగ్ధాటి ఉన్న నాయకుడిగా కేటీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు రాజకీయ అంశాలకే పరిమితమైన ఆయన వాగ్ధాటి.. ఇప్పుడు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)కు చేరింది. ఈ సదస్సులో కేటీఆర్ ఆంగ్లంలో అర్థవంతంగా, అనర్గళంగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు.
Samayam Telugu film writer paruchuri gopalakrishna showers praise on ktr
కేటీఆర్ విశ్వవిజ్ఞానఖని: పరుచూరి గోపాలకృష్ణ


జీఈఎస్‌లో రెండో రోజైన బుధవారం ‘మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యం పెంపు’ అంశంపై జరిగిన ప్లీనరీకి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇందులో ఇవాంక ట్రంప్, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ సతీమణి చెర్రీ బ్లెయర్, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్‌ ప్యానలిస్టులుగా ఉండటం విశేషం. ఈ ప్లీనరీలో ఇవాంకను పరిచయం చేయడం దగ్గర నుంచి పారిశ్రామిక రంగంలో మహిళల ప్రాధాన్యత వరకు కేటీఆర్ ప్రసంగం అద్భుతంగా ఉంది. దీంతో ఇప్పుడు కేటీఆర్‌కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి మేధావుల వరకు అందరూ కేటీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ కోవలో ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేరారు.

‘కేటీఆర్ గారు, ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు.. నిన్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు! అభినందనలండి! మీ భాషణం అనితరసాధ్యం’ అని పరుచూరి ట్వీట్ చేశారు. రుచూరి ప్రశంసకు ముగ్దుడైన కేటీఆర్ ‘థ్యాంక్స్ సర్’ అంటూ ట్వీట్ చేశారు.
@KTRTRS గారు, ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు, నిన్న #GES2017 ప్రపంచ వ్యాపారసదస్సులో విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు! అభినందనలండి! మీ భాషణం అనితరసాధ్యం👍 pic.twitter.com/8D7SlNgkLk — Paruchuri GK (@GkParuchuri) November 30, 2017 Thanks Sir 🙏 https://t.co/B7u1FfkSNp — KTR (@KTRTRS) November 30, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.