యాప్నగరం

తెలంగాణలో ముగిసిన పరిషత్ పోరు.. మే 27న ఫలితాలు

తెలంగాణలో పరిషత్ ఎన్నికల చివరి దశ మంగళవారం ముగిసింది. మూడు దశల్లో పరిషత్ ఎన్నికలను నిర్వహించారు. మే 27న ఫలితాలను వెల్లడిస్తారు.

Samayam Telugu 14 May 2019, 7:16 pm
హైదరాబాద్: తెలంగాణలో పరిషత్ మూడో విడత పోలింగ్ ముగిసింది. మంగళవారం నిర్వహించిన చివరి విడత పోలింగ్‌లోనూ భారీ స్థాయిలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 27 జిల్లాల్లో 161 జడ్పీటీసీ స్థానాలకు, 1,738 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. 30 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా.. తొలి విడతలో వాయిదా పడిన రెండు చోట్ల కూడా ఈ దశలో పోలింగ్‌ జరిగింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ సాగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.
Samayam Telugu parishad elections


తొలి విడత పరిషత్ ఎన్నికలు మే 6న జరగ్గా.. మలి విడత ఎన్నికలు మే 10న జరిగిన సంగతి తెలిసిందే. మూడు దశల్లోని ఓట్లను మే 27న లెక్కించి, అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.

మూడో విడతలో భాగంగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 70.19 శాతం పోలింగ్ నమోదవగా.. మంచిర్యాల జిల్లాలో 75.58 శాతం, ములుగు జిల్లాలో 72 శాతం పోలింగ్ నమోదైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.