యాప్నగరం

పరిటాల వర్గానికి ఝలక్..భారీ జరిమానా!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రకాష్ రెడ్డి దాఖలు చేసిన పరువునష్టం కేసులో పరిటాల వర్గానికి ఝలక్ తగిలింది.

TNN 9 Feb 2018, 6:19 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రకాష్ రెడ్డి దాఖలు చేసిన పరువునష్టం కేసులో పరిటాల వర్గానికి ఝలక్ తగిలింది. తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని.. పరిటాల వర్గంలోని ముఖ్యవ్యక్తి అయిన ఎల్.నారాయణ చౌదరి, ఆంధ్రజ్యోతి పత్రికలపై ప్రకాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో ఆసక్తిదాయకమైన తీర్పు వచ్చింది. ప్రకాష్ రెడ్డి పై టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టిన కోర్టు.. ఏకంగా పది లక్షల రూపాయల జరిమానా విధించింది. అలాగే ఈ కేసులో.. ఆంధ్రజ్యోతి పత్రికకు కూడా లక్ష రూపాయల జరిమానా విధించింది అనంతపురం జిల్లా కోర్టు. ఈ మేరకు శుక్రవారం తీర్పునిచ్చింది.
Samayam Telugu fine on tdp leader in defamation case
పరిటాల వర్గానికి ఝలక్..భారీ జరిమానా!


ఇది ఏడు సంవత్సరాల కింద దాఖలైన పిటిషన్. జూబ్లీహిల్స్ కారు బాంబు కేసులో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త అయిన తనకు సంబంధం ఉందని నారాయణ చౌదరి వ్యాఖ్యానించారని, అవి అబద్ధపు మాటలు అని ప్రకాష్ రెడ్డి కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ అనుచితమైన మాటలపై చర్యలు తీసుకోవాలని.. పరువునష్టం దావాను దాఖలు చేశారాయన. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికపై కూడా పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. టీడీపీ నేత, పరిటాల అనుచరుడు అయిన నారాయణ చౌదరివి అసంబద్ధమైన ఆరోపణలుగా తేల్చింది.

కారుబాబు కేసులో ప్రకాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ప్రకాష్ రెడ్డి పరువుకు భంగం కలిగించేలా మాట్లాడినందుకు చౌదరికి, అలాగే ఆంధ్రజ్యోతి పత్రికకు జరిమానా విధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.