యాప్నగరం

ఆంధ్రా విద్యార్థులకి 5 ఎక్స్‌ట్రా మార్కులు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్‌ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

TNN 6 Oct 2017, 1:56 pm
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్‌ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సరికొత్త ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేసే విద్యార్థిని, విద్యార్థులకి 5 మార్కులు అదనంగా కేటాయించనున్నట్టు ఏపీ ప్రభుత్వం స్పష్టంచేసింది. 9వ తరగతితోపాటు అంతకన్నా పై తరగతులు చదివే స్టూడెంట్స్‌కి ఈ ప్రతిపాదన వర్తించనుంది. ఇందుకు విద్యార్థులు చేయాల్సిందల్లా తమ గ్రామంలో మరుగుదొడ్డి లేని నివాసాలని గుర్తించడం, వారికి మరుగుదొడ్డి నిర్మాణం ఆవశ్యకతను అర్థం అయ్యేలా తెలియచెప్పడమేనని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. అందుబాటులో వున్న స్థలంలోనే మురుగుదొడ్డి నిర్మాణం చేపట్టడంలో ఎదురయ్యే సమస్యలని అధిగమించేందుకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సహకారం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వైద్య విద్యార్థుల సహకారం తీసుకునే యోచనలో అధికారులు వున్నట్టు ఎండీ మురళీధర్ రెడ్డి వెల్లడించారు.
Samayam Telugu five extra marks for andhra students who participate in swachh bharat initiative
ఆంధ్రా విద్యార్థులకి 5 ఎక్స్‌ట్రా మార్కులు


గురువారం సెక్రేటేరియట్‌‌లో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ విభాగం ఉన్నతాధికారులతో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. 2019 మార్చి నాటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని 100% బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులని ఆదేశించిన మంత్రి నారా లోకేష్.. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థుల వివరాలని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాల్సిందిగా సంబంధిత అధికారులకి సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.