యాప్నగరం

ఎంజాయ్ చేయడానికి ఇంట్లోంచి పారిపోయారు

ఏడోతరగతి చదువుతున్న అమ్మాయిలు సరదా కోసం ఇంట్లోంచి వెళ్లిపోయారు.

TNN 18 Mar 2017, 8:15 am
వారంతా ఏడో తరగతి చదువుతున్న అమ్మాయిులు. పరీక్షల తరువాత ఎంజాయ్ చేయడానికి ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పారిపోయారు. రెండు రోజులు పోలీసులకు, తల్లిదండ్రులకు చెమటలు పట్టించారు. చివరికి విశాఖ జూలో పోలీసులకు దొరికారు. పూర్తి వివరాల ప్రకారం ... హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు బాలికలు సంగీత (12), ప్రీతి (12), నందిని (12), శ్రీనిధి (12), ప్రతిభ (12) స్నేహితులు. వీరంతా ఏడోతరగతి చదువుతున్నారు. గురువారం పరీక్షలు అయ్యాక వేరే ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో ఉన్న డబ్బును తీసుకుని వచ్చేశారు. గురువారం చివరి పరీక్ష రాశాక అటునుంచి అటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లిపోయారు.
Samayam Telugu five missing girls from hyderabad traced in vishakapatnam
ఎంజాయ్ చేయడానికి ఇంట్లోంచి పారిపోయారు


పిల్లలు ఎంతకీ ఇంటికిరాక తల్లిదండ్రులు కలవరపడి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక బాలిక వద్ద సెల్‌ఫోన్‌ ఉండటంతో పోలీసులు ట్రేస్ చేయగా... గన్నవరం ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది. తరువాత సెల్ ఫోన్ జాడ తెలియలేదు. గన్నవరం వెళ్లిన తల్లిదండ్రులు, పోలీసులు అంతకన్నా ముందుకు వెళ్లలేకపోయారు.

ఇక బాలికలు విశాఖపట్నం చేరుకుని బీచ్ లో, ఉడాపార్కులో గడిపారు. శుక్రవారం కైలాసగిరి చూసి, మధ్యాహ్నానికి జూపార్కుకు వచ్చారు. అక్కడ క్యాంటీన్లో ఆహారం తింటుండగా... జూ ఉద్యోగి చూశాడు. వాళ్లతో పెద్ద వాళ్లెవరు రాకపోవడం, వారి భాష కూడా తెలంగాణ యాసతో ఉండడం గమనించాడు. ఈలోపు టీవీలో అయిదుగురు బాలికలు కనిపించడం లేదన్న వార్తను చూశారు. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు వచ్చి బాలికలను అదుపులోకి తీసుకున్నారు. గన్నవరంలో ఉన్న తల్లిదండ్రులు, హైద్రాబాద్ పోలీసులు కూడా విశాఖ చేరుకున్నారు. బాలికలను తల్లిదండ్రులకు అప్పగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.