యాప్నగరం

స్కూల్లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం

యూకేజీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారిపై కన్నేసిన కామాంధుడు. హైదరాబాదులో వెలుగు చూసిన దారుణ ఘటన.

Samayam Telugu 15 Sep 2018, 1:14 pm
చిన్నారులకు పాఠశాలల్లో కూడా భద్రత లభించడం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనం. కామంతో కళ్లు మూసుకుపోయిన పాఠశాల ఉద్యోగి.. అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై స్కూల్లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మరెక్కడో కాదు.. హైదరాబాద్‌లో టోలీచౌకీలోని ఆజాద్‌ ఇంటర్‌ నేషనల్‌ స్కూల్‌లో చోటు చేసుకుంది.
Samayam Telugu Untitled1


పాఠశాలలో యూకేజీ చదువుతున్న బాధిరాలికి చాక్లెట్ ఆశచూపి నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం ఎవరికి చెప్పవద్దని బెదిరించాడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన చిన్నారి తీవ్రంగా నొప్పి కలుగుతుందని తల్లిదండ్రులకు చెప్పింది. ఏం జరిగిందని ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. ఈ మేరకు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో పాఠశాలను చుట్టుముట్టారు. కొందరు పాఠశాల ప్రాంగణంలో ఉన్న స్కూల్ బస్సులపై రాళ్లు రువ్వి నిరసన వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని వివరాలను బయటకు వెల్లడించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.