యాప్నగరం

విషాహారం తిని విద్యార్థుల అస్వస్థత

తిరుపతిలోని కాలూరు క్రాస్‌ రోడ్డు వద్ద ఉన్న నారాయణ జూనియర్‌ కాలేజీలో హాస్టల్లో విషాహారం తిని

Samayam Telugu 20 Jan 2017, 9:58 am
తిరుపతిలోని కాలూరు క్రాస్‌ రోడ్డు వద్ద ఉన్న నారాయణ జూనియర్‌ కాలేజీలో హాస్టల్లో విషాహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి హాస్టల్‌లో పులిసిన పెరుగన్నం పెట్టడంతో స్టూడెంట్స్ అస్వస్థతకు గురైనట్లు తెలసింది. పులిసిన పెరుగన్నం తిన్న 30 మంది విద్యార్థులకు తెల్లవారు జామునుంచి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారు. హాస్టల్‌ సిబ్బంది విద్యార్థులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు.
Samayam Telugu food poison in narayana college in ap
విషాహారం తిని విద్యార్థుల అస్వస్థత


చికిత్స అనంతరం 20 మంది విద్యార్థులు తిరిగి కళాశాలకు వెళ్లగా.. మరో పది మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్‌ వద్దకు చేరుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.