యాప్నగరం

పాతనోట్లు మారుస్తామంటూ దొరికిపోయారు

రద్దయిన పాతనోట్లు రూ.500, రూ.1000లను కమిషన్ కు మార్పిడి చేసేందుకు యత్నిస్తున్న నలుగురు వ్యక్తులను హైదరాబాద్

Samayam Telugu 23 Mar 2017, 7:38 pm
రద్దయిన పాతనోట్లు రూ.500, రూ.1000లను కమిషన్ కు మార్పిడి చేసేందుకు యత్నిస్తున్న నలుగురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని అంబర్‌పేట పోస్టాఫీసు వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ముఠా వద్ద నుంచి రూ.48.66 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
Samayam Telugu four person held for trying exchanging old notes in hyderabad
పాతనోట్లు మారుస్తామంటూ దొరికిపోయారు


హైదరాబాద్ కూకట్‌పల్లిలో నివాసముంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణ చైతన్యకుమార్ రెడ్డి, కడప ఎర్రముక్కపల్లికి చెందిన సురేష్‌బాబు, రామంతాపూర్ కి చెందిన వ్యాపారి జగదీశ్‌, డీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన ఎం.వెంకటేశ్వర్‌ లు పాత నోట్లను మారుస్తామని కమిషన్ వసూలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.

పాత కరెన్సీని ఏపీలోని కడప జిల్లా చెందిన సుబ్బారెడ్డి హైదరాబాద్ కు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైంద‌ని పోలీసులు తెలిపారు. రూ.లక్షకు 60 శాతం కమిషన్‌తో నోట్లను మార్పిడి చేయడానికి సిద్ధంగా ఉంచిన కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.