యాప్నగరం

అద్భుత స్వాగతానికి మురిసిపోయిన ఇవాంకా!

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ 2017కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్‌హౌస్ ముఖ్య సలహాదారు ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసింది.

TNN 28 Nov 2017, 12:50 pm
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ 2017కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్‌హౌస్ ముఖ్య సలహాదారు ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసింది. మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో భాగ్యనగరానికి చేరుకున్న ఇవాంకాకు ఘనస్వాగతం లభించింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పటిష్ట భద్రత మధ్య ఆమె ట్రైడెంట్ హోటల్‌కు చేరుకున్నారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకున్న ఆమె ఉదయం 10.22 గంటలకు భాగ్యనగరం నుంచి తొలి ట్వీట్ చేశారు. "అద్భుతమైన స్వాగతానికి ధన్యవాదాలు. హైదరాబాదులో ఉండటం పట్ల ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నా" అంటూ ట్వీట్ చేసిన, ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Samayam Telugu ges 2017 ivanka has excited warm welcome
అద్భుత స్వాగతానికి మురిసిపోయిన ఇవాంకా!


మరోవైపు ప్రధాని మోదీ... ఇవాంకా ట్రంప్ ట్వీట్ కు ప్రతిస్పందించారు. 'వెల్ కమ్ టు ఇండియా' అంటూ ట్వీట్ చేశారు. ఇవాంకా ట్రంప్ పర్యటన నేపథ్యంలో నెల రోజుల కిందటే అమెరికా అధికారులు హైదరాబాద్‌కు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెచ్‌ఐఐసీలో జరిగే జీఈఎస్ 2017కు ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రపంచంలోని వ్యాపార దిగ్గజాలు హాజరవుతున్నారు. మూడు రోజులపాటు సాగే ఈ సదస్సులో ఇవాంకా నేడు పాల్గొంటారు.

Thank you for the warm welcome. I’m excited to be in Hyderabad, India for #GES2017. https://t.co/1U08h5L9Rm — Ivanka Trump (@IvankaTrump) November 28, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.