యాప్నగరం

జగన్‌పై కాదు, ఈశ్వరి కోపం ఆయనపై..!

ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతూ కూడా.. ఆ పార్టీ గురించి సానుకూలంగా మాట్లాడారు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.

TNN 28 Nov 2017, 8:24 am
ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతూ కూడా.. ఆ పార్టీ గురించి సానుకూలంగా మాట్లాడారు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన కొందరు ఎమ్మెల్యేలు.. ఆ పార్టీ అధినేత జగన్ పై విమర్శలు చేస్తూ వెళ్లారు. కొందరు డెవలప్ మెంట్ కోసం చేరుతున్నామని అన్నారు. గిడ్డి ఈశ్వరి కూడా డెవలప్ మెంట్ నినాదాన్ని చేశారు.. అయితే ఫిరాయింపుకు ముందు ఈమె మీడియాతో మాట్లాడుతూ.. పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని వ్యాఖ్యానించారు.
Samayam Telugu giddi eeshwary targets vijayasai reddy
జగన్‌పై కాదు, ఈశ్వరి కోపం ఆయనపై..!


గత మూడేళ్లలో పార్టీ చాలా బలోపేతం అయ్యిందని ఆమె అన్నారు. అలాగే వైఎస్సార్సీపీ అధినేత జగన్ మీద కూడా చాలా సానుకూల వ్యాఖ్యలే చేశారీమె. ‘జగనన్న..’అంటూ సంబోధించడం కూడా గమనార్హం. ‘జగనన్న అంటే నాకు ప్రాణం... నాకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డే. ఉపాధ్యాయురాలిగా ఉన్న నన్ను ఎమ్మెల్యేగా చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గిరిజనులకు ఎంతో మేలు జరిగింది. గత మూడేళ్లలో అరకు, పాడేరు నియోజకవర్గాల్లో వైసీపీ ఎంతో బలపడింది. తెలుగుదేశం గెలవడం కూడా కష్టమే. అయితే నేను టీడీపీలో చేరి పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తాను. వైఎస్సార్సీపీలో కొంతమంది నేతలు గత కొన్నాళ్లుగా నాకు ప్రాధాన్యతను తగ్గిస్తూ వచ్చారు..’ అని ఈశ్వరి అన్నారు.

మరి ఈ మాటలను బట్టి చూస్తే.. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే జగన్ కన్నా వైఎస్ఆర్‌సీపీలోని వేరే వాళ్లను లక్ష్యం చేసుకున్న వైనం స్పష్టం అవుతోంది. ఇంతకీ ఆ వేరే ఎవరు? అంటే.. విజయసాయి రెడ్డి పేరు వినిపిస్తోంది.

పాడేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈశ్వరి అరకు అసెంబ్లీ సీటుపై పట్టుబిగిస్తూ వచ్చారు. అక్కడ కూడా వైసీపీ తరఫు నుంచి తను చెప్పిన వారినే నిలబెట్టాలని ఆమె అనుకున్నారు. అయితే అందుకు భిన్నంగా విశాఖ జిల్లా రాజకీయాలను సమీక్షిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి అరకులో మరొకరిని రంగంలోకి దింపారు. ఫలితంగా అసహనభరితులయ్యారు ఈశ్వరి. ఇదే సమయంలో టీడీపీ నుంచి ఆఫర్ రావడంతో జంప్ చేసేసినట్టుగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.