యాప్నగరం

పడవ ప్రమాదం: మరో మృతదేహం వెలికితీత

గోదావరి నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతైన వారిలో బుధవారం (జులై 18) మరో బాలిక మృతదేహం లభ్యమైంది. సహాయక బృందాలు చేపట్టిన గాలింపు చర్యల్లో ఇప్పటివరకు నాలుగు మృతదేహాలు దొరికాయి.

Samayam Telugu 18 Jul 2018, 11:04 pm
గోదావరి నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతైన వారిలో బుధవారం (జులై 18) మరో బాలిక మృతదేహం లభ్యమైంది. సహాయక బృందాలు చేపట్టిన గాలింపు చర్యల్లో ఇప్పటివరకు నాలుగు మృతదేహాలు దొరికాయి. ఇంకా ముగ్గురు బాలికల మృతదేహాలు లభ్యంకావాల్సి ఉంది. బుధవారం సాయంత్రం లభించిన మృతదేహం శేరిలంక గ్రామానికి చెందిన పోలిశెట్టి మనీష (15)దిగా గుర్తించారు. సూర్యనారాయణ, నాగలక్ష్మి దంపతుల కూమార్తె అయిన మనీష పశువుల్లంక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
Samayam Telugu godavari


యానాం ఫ్రాన్స్‌తిప్పకు చెందిన మత్స్యకారుల బృందం ఐ.పోలవరం మండలం కొమరగిరి పుష్కర ఘాట్‌ సమీపంలో మనీష మృతదేహాన్ని గుర్తించింది. అధికారులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యానాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకలో శనివారం జరిగిన పడవ ప్రమాదంలో మొత్తం ఏడుగురు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటన లంక గ్రామాల్లో తీవ్ర విషాదం నింపింది. బాధితులంతా స్కూల్ విద్యార్థులే. గల్లంతైన వారికోసం సహాయక బృందాలు గత 5 రోజులుగా ముమ్మరంగా గాలిస్తు్న్నాయి. హోమంత్రి చినరాజప్ప అక్కడే ఉండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.