యాప్నగరం

నేడు గద్దె మీదకు సారలమ్మ, గ్రహణం ఎఫెక్ట్ ఉంటుందా?

బుధవారం సారలమ్మ కన్నెపల్లి నుంచి బయల్దేరి మేడారం గద్దె మీదకు చేరుకోనుంది. జాతరపై గ్రహణం ప్రభావం ఉండనుందా?

TNN 31 Jan 2018, 8:42 am
మేడారం సమ్కక్క సారలమ్మ జాతర బుధవారం ప్రారంభమైంది. తొలి రోజు సాయంత్రం సారలమ్మ గద్దె మీదకు రానుంది. సారలమ్మను కన్నెపల్లి నుంచి పూజారులు వెదురుబుట్టలో ముస్తాబు చేసి తీసుకొస్తారు. అమ్మవారిని బయటకు తీసుకొచ్చే ముందు గుడి ముందు భక్తులు తడి వస్త్రాలతో వరం పడతారు. వారిపై నడుచుకుంటూనే సారలమ్మను తీసుకొస్తారు. ఇప్పటికే పగిడిద్ద రాజు జంపన్న వాగు దగ్గరకు చేరుకున్నారు. మంగళవారమే మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారానికి బయల్దేరారు. పూన్క వంశీయులు ఆయన్ను పెళ్లి కొడుకుగా ముస్తాబు చేశారు. ఆయన తమ్ముడు గోవిందరాజు ఏటూరునాగరం మండలం కొండాయి నుంచి మేడారం చేరుకుంటారు.
Samayam Telugu goddess saralamma ammavaru will arrive on gadde from kannepally village
నేడు గద్దె మీదకు సారలమ్మ, గ్రహణం ఎఫెక్ట్ ఉంటుందా?


సారలమ్మ రాక కోసం జంపన్నవాగు దగ్గర పగిడిద్ద రాజు, గోవింద రాజులు వేచి చూస్తుంటారు. సారలమ్మ అక్కడికి చేరుకోగానే ముగ్గుర్ని ఒకేసారి ఊరేగింపుగా గద్దెల మీదకు తీసుకొస్తారు. బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో సారలమ్మ గద్దె మీదకు రానుంది.

కానీ బుధవారం సాయంత్రం 5 గంటల 18 నిమిషాల నుంచి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. దీంతో సారలమ్మకు చేయాల్సిన పూజా క్రతువు సమయంలో మార్పులు ఉంటాయనే ఊహాగానాలు బయల్దేరాయి. ఈ విషయమై పూజారులు స్పందిస్తూ.. తాము గ్రహణాన్ని పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేశారు. కన్నెపల్లిలో చేయాల్సిన క్రతువులను గ్రహణానికి ముందే పూర్తి చేస్తామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.