యాప్నగరం

అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం.. ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్

అసెంబ్లీ రద్దుకు ఆమోదం తెలిపిన గవర్నర్ నరసింహన్.. నోటిఫికేషన్ విడుదల చేసిన రాజ్‌భవన్. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్.

Samayam Telugu 8 Sep 2018, 1:28 pm
తెలంగాణ అసెంబ్లీ అధికారికంగా రద్దయ్యింది. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి ఆమోదించిన తీర్మానాన్ని కేసీఆర్‌ గవర్నర్‌‌కు సమర్పించగా.. ఆయన ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కేసీఆర్‌ను నరసింహన్ కోరారు. ఈ మేరకు రాజ్‌భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను అసెంబ్లీ కార్యదర్శితో పాటూ ఎన్నికల కమిషన్‌కు పంపారు. అలాగే ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్, ఆపద్ధర్మ మంత్రిమండలి కొనసాగిస్తూ సీఎస్ జోషి జీవో నెంబర్ 134ను జారీ చేశారు.
Samayam Telugu KCR.


అంతకు ముందు ప్రగతి భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ భేటీలో అసెంబ్లీ రద్దుపై తీర్మానం చేసి.. మంత్రులతో కలిసి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. మంత్రివర్గ తీర్మానాన్ని సమర్పించి నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ అసెంబ్లీ రద్దుకు కారణాలను వివరించారు. 2014 జూన్ 2న కేసీఆర్ తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. 2018 సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేశారు. అంటే ప్రభుత్వం ఏర్పడి సెప్టెంబర్ 6నాటికి 4 సంవత్సరాల 3 నెలల 4రోజులు అయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.