యాప్నగరం

ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ దంపతుల తొలి పూజలు

ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతికి గవర్నర్ దంపతులు కాసేపి క్రితం తొలిపూజలు నిర్వహించారు.

TNN 5 Sep 2016, 11:42 am
ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన శ్రీ శక్తి పీఠ శివనాగేంద్ర మహాగణపతికి గవర్నర్ దంపతులు కాసేపటి క్రితం తొలిపూజలు నిర్వహించారు. ఉదయం 9:30 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడి వద్దకు చేరుకున్న గవర్నర్ నరసింహన్ దంపతులు భారీ గణపతికి పూజలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి.. గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. గవర్నర్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 58 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విష్ణు రూపంలో, వెనుక వైపు శివలింగంతో ఈ భారీ గణనాథుణ్ని శిల్పి రాజేంద్రన్ తీర్చిదిద్దారు. ఆదివారం నుంచే ఖైరతాబాద్ వినాయకుడి సందర్శనానికి భక్తుల రాక మొదలైంది. వినాయక చవితి సందర్భంగా నేడు భారీ సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
Samayam Telugu governor family performed pradhama poja for khairatabad vinayaka
ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ దంపతుల తొలి పూజలు

ఖైరతాబాద్ గణపతి విగ్రహం వెనుక శివలింగం, ఆ వెనుక నుంచి పైభాగం వరకు నాంగేంద్రుడి పడగలు ఉంటాయి. ప్రతిమ వెనుక భాగం పుట్టతో, పుట్టపై భాగాన.. క్షీరాభిషేకం చేస్తునట్లు రెండు గోవులు ఉంటాయి. స్వామికి ఎడమ వైపున శక్తిపీఠాల్లోని మొదటిదైన శ్రీలంకలోని శాంకరిదేవి, కుడివైపు సరస్వతి దేవి సింహాసనంపై ఆసీనులై ఉన్నారు. పై రెండు చేతుల్లో చక్రం, శంఖం, మధ్య చేతుల్లో ఆశీర్వాదం, లడ్డూ, కింది చేతుల్లో గద, పద్మంతో.. మొత్తం ఆరు చేతులతో రూపొందిన వినాయకుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.