యాప్నగరం

Hyd Metro: అమీర్‌పేట - ఎల్‌బీ నగర్ మెట్రో మార్గం ప్రారంభం

దేశంలో ఢిల్లీ తర్వాత ఎక్కువ దూరం మెట్రో రైలు మార్గం ఉన్న నగరంగా హైదరాబాద్‌ ఘనత సాధించింది. అమీర్‌పేట - ఎల్‌బీనగర్ మెట్రో మార్గాన్ని గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు.

Samayam Telugu 24 Sep 2018, 1:06 pm
భాగ్యనగరానికి మణిహారంగా మారిన ‘హైదరాబాద్ మెట్రో’ మరో అంకం పూర్తి చేసుకుంది. నగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమీర్‌పేట - ఎల్‌బీ నగర్ మార్గం అందుబాటులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. సోమవారం (సెప్టెంబర్ 24) మధ్యాహ్నం 12.15 గంటలకు అమీర్‌పేటలో మెట్రో రెండో దశ రైలు మార్గాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆయన వెంట ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తదితరులు ఉన్నారు. దీంతో దేశంలో ఢిల్లీ తర్వాత ఎక్కువ దూరం మెట్రో రైలు మార్గం ఉన్న నగరంగా హైదరాబాద్‌ ఘనత సాధించింది. అంతేకాకుండా హైదరాబాద్ మెట్రోలో అతి పెద్ద కారిడార్ (29 కి.మీ.) పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లయింది.
Samayam Telugu metro2


మియాపూర్ - ఎల్‌బీనగర్ మెట్రో మార్గం మొత్తం పొడవు 29 కి.మీ. కాగా.. మియాపూర్ నుంచి అమీర్‌పేట వరకు 13 కి.మీ. ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఇక ఇప్పటికే ప్రారంభమైన మియాపూర్ - అమీర్‌పేట - నాగోల్ మెట్రో మార్గం పొడవు 30 కి.మీ.తో కలుపుకొని తాజాగా అందుబాటులోకి వచ్చిన అమీర్‌పేట - ఎల్‌బీనగర్ మార్గం 16 కి.మీ.తో హైదరాబాద్ మెట్రో మొత్తం పొడవు 46 కి.మీ.లకు చేరుకుంది. దేశంలో రెండో అతిపొడవైన మార్గంగా గుర్తింపు సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై (35.3 కి.మీ), కోల్‌కతా (28.1 కి.మీ.), కోచి (18.2), గుర్గావ్ (12.1 కి.మీ.), ముంబై (11.4 కి.మీ.), జయపుర (9.6 కి.మీ.), లక్నో (8.5 కి.మీ.) మెట్రోలు ఉన్నాయి.

Also Read: ఎల్‌బీనగర్ మార్గం విశేషాలివే..undefined
అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ మెట్రో మార్గాన్ని కూడా ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఎల్‌బీ నగర్ మార్గం ప్రారంభించిన తర్వాత గవర్నర్‌తో కలిసి ఆయన మెట్రో రైలులో ప్రారంభించారు. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ మార్గంలో మెట్రో రైలు సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.

ఎల్‌బీ నగర్ మెట్రో మార్గం అందుబాటులోకి రావడంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భాగ్యనగర వాసుల నిరీక్షణకు తెరపడింది. అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని ఆగస్టు నెలలోనే ప్రారంభిస్తారని అధికారులు గతంలో ప్రకటించారు. అయితే.. సెప్టెంబర్ 15 కూడా దాటిపోతుండటంతో హైదరాబాద్ వాసుల్లో ఉత్కంఠ పెరిగింది. ఇలాంటి తరుణంలో మెట్రో ప్రారంభం కావడం భాగ్యనగరవాసులకు గొప్ప ఊరట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.