యాప్నగరం

బాలికకి ఊపిరిపోసిన ట్రాఫిక్ పోలీస్..!

బ్రెయిన్‌ డెడ్ అయిన రోగి గుండెను ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి నిమిషాల వ్యవధిలోనే తరలించేందుకు సహాయపడి హైదరాబాద్ ట్రాఫిక్

Samayam Telugu 5 Jul 2018, 9:02 am
బ్రెయిన్‌ డెడ్ అయిన రోగి గుండెను ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి నిమిషాల వ్యవధిలోనే తరలించేందుకు సహాయపడి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో కుమార్ (21) తలకి బలమైన గాయం తగలడంతో జూబ్లీహిల్స్‌ అపోలో వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. దీంతో.. జీవన్‌దాన్ సంస్థ సభ్యులు కుమార్ కుటుంబీకులతో మాట్లాడి అవయవదానంపై అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో కుమార్ గుండెను లక్డీకపూల్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోమ అనుష్క(15)కి అమర్చాలని వైద్యులు నిర్ణయించుకుని ట్రాఫిక్ పోలీసుల సహాయం కోరారు.
Samayam Telugu 1.


జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రి నుంచి లక్డీకపూల్‌ గ్లోబల్ ఆసుపత్రికి మధ్య దూరం 8.7 కిలోమీటర్లు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ని అధిగమించి అంబులెన్స్‌లో గుండెని అక్కడికి తరలించడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. కానీ.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చొరవ తీసుకుని.. గ్రీన్ చానల్ ఏర్పాటు చేయడంతో కేవలం 11 నిమిషాల వ్యవధిలోనే గుండెని విజయవంతంగా గ్లోబల్ ఆసుపత్రికి తరలించగలిగారు. అంబులెన్స్‌కి వాహనాలు అడ్డురాకుండా.. వీవీఐపీ బందోబస్తు తరహాలో ట్రాఫిక్‌ని క్లియర్ చేయడంతో బుధవారం ఉదయం 10.52కి బయల్దేరిన అంబులెన్స్ 11.03 నిమిషాలకి గ్లోబల్ ఆసుపత్రికి చేరుకోగలిగింది. అనంతరం నాలుగు గంటలపాటు డాక్టర్లు శ్రమించి అనుష్కకి గుండెని అమర్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.