యాప్నగరం

డైనమిక్ లీడర్ కేటీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు..

ఈ రోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఒక రోజు ముందుగానే ఆయన అభిమానులు నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. వారికి కేటీఆర్ షాకిచ్చారు..

TNN 24 Jul 2016, 9:01 am
ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్ జన్మదినం. ఈ సందర్భంగా ఒకరోజు ముందుగానే నగరంలోని ఆయన అభిమానులు, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, కటౌట్లను ఏర్పాటు చేశారు. అయితే వీరందరికీ షాక్ ఇచ్చేలా కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నగరంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, కటౌట్లను తొలగించాలని ఆయన జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ యంత్రాంగం.. నగరంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఫెక్సీలు, కటౌట్లను తొలగించింది. శనివారం ఒక్కరోజే 4 వేల ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లను తొలగించామని నగర కమిషనర్‌ డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. తొలగించిన వాటిలో కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసినవే ఎక్కువగా ఉండటం విశేషం. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసినందుకు రూ.4.09 లక్షల రూపాయాలను ఫైన్ రూపంలో వసూలు చేశామని నగర కమిషర్ తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారు తన అనుచరులైనా, పార్టీ అభిమానులైనా ఉపేక్షించేది లేదని కేటీఆర్ ఈ చర్యతో పరోక్షంగా హెచ్చరికలు పంపారు. తమ ప్రభుత్వ పరిపాలన పారదర్శకంగా ఉండేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్న కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు.
Samayam Telugu happy birthday telangana minister ktr
డైనమిక్ లీడర్ కేటీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు..

కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే దిల్‌షుక్ నగర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 5 వేల మొక్కలు నాటి ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు.

Children of Dilsukhnagar Public School hv planted 5000 saplings, a green gift to KTR garu on the eve of his birthday pic.twitter.com/E730fVVp1Y— BonthuRammohan,Mayor (@bonthurammohan) July 23, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.