యాప్నగరం

‘పంచె కట్టేసినా...’ హరీషన్నా నీవు...!

ఎప్పుడూ ప్యాంటు చొక్కాతో కనిపించే తెలంగాణ భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావు గెటప్ మార్చారు.

Samayam Telugu 7 Nov 2016, 10:28 am
ఎప్పుడూ ప్యాంటు చొక్కాతో కనిపించే తెలంగాణ భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావు గెటప్ మార్చారు. పంచెకట్టులో అచ్చం రైతులా మారిపోయారు. ఆయనొక్కరే కాదు సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డిలతో కూడా పంచెలు కట్టించారు.
Samayam Telugu harish rao donned panche looks like a farmer
‘పంచె కట్టేసినా...’ హరీషన్నా నీవు...!


ప్రత్యేకించి హరీష్ రావు పంచెకట్టు ఆదివారం ఓ కార్యక్రమంలో రైతులను విశేషంగా ఆకట్టుకుంది.

మంత్రులు హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి తదితరులు ఆదివారం నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ పాలక మండలి ప్రమాణ స్వీకరోత్సవానికి ఇలా పంచెకట్టులో హాజరయ్యారు.

భారీ నీటిపారుదల శాఖమంత్రిగా, రైతుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న హరీష్ రావు పంచెకట్టులో సహజమైన రైతులా ఉన్నారని పలువురు రైతులు కితాబిచ్చారు.


ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసి తెలంగాణ నేలపై పసిడిపంటలు పండిస్తామని అన్నారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేశామని, ఇందుకు అవసరమైన భూసేకరణ 123జీవో ప్రకారమే చేస్తున్నట్లు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.