యాప్నగరం

ఆరోగ్యమే మహాభాగ్యం: ఏపీ సీఎం చంద్రబాబు

ఆరోగ్యమే మహాభాగ్యం..ఆరోగ్యం ఉంటే ఆనందం..ఆనందంగా ఉంటేనే అభివృద్ఢిని త్వరితగతిన సాధించవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

Samayam Telugu 25 Feb 2017, 11:17 am
ఆరోగ్యమే మహాభాగ్యం..ఆరోగ్యం ఉంటే ఆనందం..ఆనందంగా ఉంటేనే అభివృద్ఢిని త్వరితగతిన సాధించవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఆయన వైద్యఆరోగ్యశాఖపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
Samayam Telugu health is welth says ap cm chandrababu naidu
ఆరోగ్యమే మహాభాగ్యం: ఏపీ సీఎం చంద్రబాబు


గ్రామాలు, వార్డుల్లో ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేయాలని ఆయన అధికారులకు సూచించారు. పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. డయేరియా, టైపాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.

మంచినీటి వనరుల పరిరక్షణతో పాటు వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణపై చర్యలు చేపట్టాలని బాబు చెప్పారు. గ్రామాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు చంద్రన్న సంచార వాహనాలు అందుబాటులోఉంచడంతో పాటు ఎన్టీఆర్ క్లినికల్ టెస్టులు ఉచితంగా చేస్తున్నామని గుర్తు చేశారు. వ్యాధుల నియంత్రణకు అవసరమైతే ప్రైవేటు వైద్యుల సేవలు కూడా తీసుకోవాలని బాబు సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.